Site icon NTV Telugu

Jasprit Bumrah: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లిన బూమ్రా..

Bumraha

Bumraha

Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టుల్లో 7 వికెట్లు తీసుకుని భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని తన దగ్గరే అట్టి పెట్టుకున్నాడు. ఇక, సెకండ్ ప్లేస్ లో ఉన్న కగిసో రబాడ బుమ్రాకు మధ్య కేవలం 50 రేటింగ్ పాయింట్ల తేడానే ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన పింక్ బాల్‌ టెస్టులో హ్యాట్రిక్ సహా 6 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 6వ స్థానంలో నిలిచి తన కెరీర్‌లో బెస్ట్ ర్యాంకు అందుకున్నాడు. అలాగే, ఆస్ట్రేలియా బౌలర్లు పాట్ కమిన్స్ (3వ), హేజిల్‌వుడ్ (4వ), నాథన్ లియాన్ (8వ), మిచెల్ స్టార్క్ (10వ) స్థానాల్లో కొనసాగుతుండగా.. టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఐదుగురు ఆస్ట్రేలియా బౌలర్లే ఉన్నారు.

Read Also: The Girlfriend: ‘నదివే’ అంటూ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రష్మిక, దీక్షిత్ శెట్టి..!

ఇక, ఆస్ట్రేలియాతో జరిగిన డే/నైట్‌ టెస్టులో 8 వికెట్లు తీసిన వెస్టిండీస్ ఫాస్ట్‌బౌలర్ షమార్ జోసెఫ్ 14వ స్థానంలో ఉండగా.. లార్డ్స్ టెస్టులో నాలుగు వికెట్లు తీసిన భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 46వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. అయితే, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ విషయాని వస్తే.. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ తిరిగి తొలి స్థానానికి చేరుకోగా.. కేన్ విలియమ్సన్ రెండో ప్లేస్‌లో కొనసాగుతుండగా.. హ్యారీ బ్రూక్ (862) మూడో స్థానానికి పడిపోయాడు. యశస్వి జైస్వాల్ ను వెనక్కి నెట్టి నాలుగో స్థానంలో స్టీవ్ స్మిత్ నిలిచాడు. అలాగే, రిషభ్‌ పంత్ 8వ స్థానంలో.. శుభ్‌మన్ గిల్ తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. ఇక, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ వరుసగా 34, 35 ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు.

Exit mobile version