Site icon NTV Telugu

FIFA World Cup: మరో సంచలనం.. జర్మనీపై జపాన్ ఘనవిజయం

Fifa World Cup

Fifa World Cup

FIFA World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో వరుసగా రెండో రోజు కూడా సంచలనం నమోదైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాను పసికూడ సౌదీ అరేబియా ఓడించి చరిత్ర సృష్టించింది. బుధవారం కూడా మరో సంచలనం నమోదైంది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో జపాన్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధ భాగం ముగిసే సరికి జర్మనీ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

Read Also: Shocking Incident: ఒకబ్బాయిపై నలుగురు అమ్మాయిలు సామూహిక అత్యాచారం

అయితే జపాన్ ఆటగాళ్లు విజృంభించి స్వల్ప వ్యవధిలోనే రెండు గోల్స్ సాధించారు. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అభిమానులు భావించారు. కానీ ఆ తర్వాత జర్మనీని జపాన్ ఆటగాళ్లు జాగ్రత్తగా అడ్డుకుంటూ నిలువరించగలిగారు. దీంతో మ్యాచ్ ముగిసే సరికి 2-1తో జపాన్ విజయం సాధించి సంచలనం నమోదు చేసింది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-1 తేడాతో విజయం సాధించింది. ఫ్రాన్స్ ఆటగాళ్ల దూకుడు ముందు నిలవలేకపోయిన ఆస్ట్రేలియా వరుస గోల్స్ సమర్పించుకుని ఓటమి పాలైంది. మొరాకో-క్రొయేషియా మధ్య జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Read Also: Shocking Incident: ఒకబ్బాయిపై నలుగురు అమ్మాయిలు సామూహిక అత్యాచారం

Exit mobile version