NTV Telugu Site icon

ENG vs WI: లార్డ్స్‌ టెస్ట్‌ను గంట కొట్టి ప్రారంభించిన అండెర్సన్ ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా..?

Maxresdefault

Maxresdefault

James Andersen Daughters Ring The Bell: ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరగబోయే 3టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో నేడు మొదటి టెస్ట్ మ్యాచ్ లార్డ్స్‌ స్టేడియంలో ప్రారంభం అయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్‌గా ఖ్యాతి పొందిన ఇంగ్లండ్‌ సీనియర్‌ స్టార్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్‌. అతని చివరి మ్యాచ్‌ ఎప్పటికి గుర్తుకు ఉండిపోయేలా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అది ఏమిటి అంటే.. లార్డ్స్‌లో జరిగే టెస్ట్‌ మ్యాచ్‌లను స్టేడియంలో ఉండే పెద్ద గంటను మోగించి ప్రారంభించడం ఆనవాయితీ. అయితే ఈ సారి ఆ గంట మోగించే అవకాశం అండర్సన్‌ కుటుంబ సభ్యులకు కల్పించారు. అండర్సన్‌ మైదానం లో ఉండగా తన ఇద్దరు కూతుళ్లు పెద్దమ్మాయి లోలా రోస్‌, చిన్న కూతురు రూబీ లక్స్ చేత గంట మోగించి తనకి జీవితంలో గుర్తుకు ఉండిపోయేలా గ్రాండ్ గ రిటైర్మెంట్ వేడుకలు నిర్వహించారు.

Also Read: Gautam Gambhir: ఇక నా లక్ష్యం అదే: గౌతమ్‌ గంభీర్‌

తన ఇద్దరి కూతుర్లు ఆ బెల్ మోగించడం చూసి అండెర్సన్ తన కన్నీళ్లతో ఆనంద భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అండర్సన్‌ కెరీర్‌లో ఇది 188వ టెస్టు. ఇప్పటికే 187 మ్యాచ్‌ల్లో సరిగ్గా 700 వికెట్లు పడగొట్టిన 41 ఏళ్ల జిమ్మీ.. తన ఆఖరి టెస్టులో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరం. అతను మరో 9 మందిని ఔట్‌ చేస్తే అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన బౌలర్లలో రెండో స్థానంలో ఉన్న షేన్‌ వార్న్‌ (708)ను అధిగమిస్తాడు. 2003లో జింబాబ్వేపై లార్డ్స్‌లో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన అండర్సన్‌.. తన చివరి టెస్టునూ లార్డ్స్‌లోనే ఆడబోతుండటం విశేషం.