Jacob Bethell: టీమిండియాకు మరో విదేశీ అల్లుడు? ఇండియన్ బ్యూటీతో లవ్‌లో పడ్డ ఇంగ్లండ్ సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jacob Bethell: ఇంగ్లండ్ యువ క్రికెట్ సంచలనం జాకబ్ బెథెల్ (Jacob Bethell) ఆటతోనే కాకుండా ఇప్పుడు తన పర్సనల్ లైఫ్‌తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ యువ ఆల్‌రౌండర్ ఒక ఇండియన్ అమ్మాయితో సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఆయన ఒక అమ్మాయితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ఫొటో కూడా నెట్టింట వెలుగులోకి రావడంతో ఈ ప్రేమ పుకార్లకు మరింత బలం చేకూరింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటోలో జాకబ్ ఒక అమ్మాయిని కౌగిలించుకుని రొమాంటిక్‌గా పోజు ఇస్తూ కనిపించాడు. అయితే ఆ ఫొటోలో సదరు అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో అసలు జాకబ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆ మిస్టరీ గర్ల్ ఎవరై ఉంటుందా? అని క్రికెట్ అభిమానులు ఆరా తీయడం స్టార్ట్ చేశారు.
సోషల్ మీడియా నెటిజన్ల రీసర్చ్ ప్రకారం.. ఆ ఫొటోలో ఉన్నది ముంబైకి చెందిన ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అంకితా పటేల్ అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. అంకిత బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న మేకప్ ఆర్టిస్ట్. ఆమె గతంలో స్టార్ హీరోయిన్లు శిల్పా శెట్టి, పలక్ తివారీ, హినా ఖాన్ వంటి సెలబ్రిటీలతో కలిసి పనిచేసింది. జాకబ్ ఆమె ప్రేమలోనే పడ్డాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రేమ వ్యవహారంలో అంకితా పటేల్ పేరుతో పాటు మరో భారతీయ యువ నటి ఆధ్యా ఆనంద్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఐపీఎల్ (IPL) సమయంలో జాకబ్, ఆధ్యా ఒకరికొకరు బాగా దగ్గరయ్యారని కొందరు నెట్టిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో ఆధ్యా ఆనంద్ పెట్టే ప్రతి పోస్ట్‌ను జాకబ్ బెథెల్ రెగ్యులర్‌గా లైక్ చేస్తూ వస్తుండటాన్ని ఫ్యాన్స్ స్క్రీన్ షాట్లతో సహా బయటపెడుతున్నారు. ఒకవైపు ముంబై మేకప్ ఆర్టిస్ట్ అంకిత, మరోవైపు నటి ఆధ్యా ఆనంద్.. ఈ ఇద్దరిలో జాకబ్ మనసు దోచింది ఎవరనే సస్పెన్స్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చర్చకు కారణం అవుతుంది. అయితే ఈ రూమర్లపై అటు క్రికెటర్ జాకబ్ బెథెల్ కానీ, ఇటు అంకిత లేదా ఆధ్యా కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వైరల్ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వారిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
No way Jacob Bethell is dating an Indian girl named Ankita, who's a celebrity makeup artist in Mumbai!😭
The 22-year-old England all-rounder, who's been killing it for RCB in the IPL and recently dropped fireworks in the T20 World Cup, was seen sharing cozy moments with Ankita.… pic.twitter.com/xKlT5kLg1u
— Warlock Hindu (@WarlockHindu) June 20, 2026
Damn I found this pic on Reddit of Aadhya Anand and Jacob bethell and it was uploaded on her private Instagram but anyway they looks cute 🥺🥺🥺🥺🥺 pic.twitter.com/IQa30ofdFa
— vanshika (@VanshuKiid) June 20, 2026
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!