Virat Kohli: డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఇండియా కష్టాల్లో ముందుకు వెళ్తుంది. ఆసీస్ నెలకొల్పిన భారీ స్కోరును చేధించడంలో భారత బ్యా్ట్స్ మెన్స్ విఫలమవుతున్నారు. ముఖ్యంగా కింగ్ కోహ్లీపైనే ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు. భారత్ బ్యాటింగ్ తరుఫున ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ తక్కువ పరుగులకే ఔటయ్యాక.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఐపీఎల్ లో మంచి ఫాంలో ఉన్న కోహ్లీ.. డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా అదే ఫాంను కనబరుస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతికి కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.
Read Also: Jharkhand: కుప్పకూలిన బొగ్గుగని.. ముగ్గురు మృతి.. పలువురు చిక్కుకున్నట్లు అనుమానం
ఇదిలా ఉంచితే.. కోహ్లీ ప్రదర్శనపై క్రికెట్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ ఔటైన వెంటనే తన జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో భోజనం చేస్తున్న ఫోటోను షేర్ చేసుకోవడం అభిమానులకు అస్సలు నిద్రపట్టడం లేదు. టెస్టుల్లో అతని కమ్ బ్యాక్ గురించి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్.. అతని పేలవ ప్రదర్శనతో షాక్ అయ్యారు. ఈ వెంటనే ఆయనను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Read Also: Ponguleti Sudhakar Reddy: 15న ఖమ్మంకు అమిత్ షా.. బహిరంగ సభను విజయవంతం చేయాలి..
2003 ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ త్వరగా ఔట్ కావడంపై తీవ్ర మనస్థాపానికి గురై మూడు రోజుల వరకు భోజనం ముట్టుకోలేదు. కానీ కోహ్లీ మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఔటైన వెంటనే తింటున్నాడు అంటూ ఓ యూజర్ ఘాటుగా ట్వీట్ చేశాడు. ఇది కోహ్లీ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే 3వ రోజు ఆట ప్రారంభం కావడానికి ముందు కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ట్రోలర్స్‌కి చెక్ పెట్టేందుకు యత్నించాడు. ఆట పట్ల ప్రేమ, అంకితభావం విషయంలో కోహ్లి ఏ ఆటగాడి కంటే తీసిపోడు. విరాట్ ఎంత పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తాడో.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వీరోచిత పోరాటంతో గట్టెక్కించాడో అందరికీ తెలుసు. అయినా సరే దురదృష్టవశాత్తూ ఔటయ్యాక తినడం కూడా తప్పే అన్నట్టుగా ట్రోల్ చేయడం ఏంటో అర్థం కావడం లేదు.