ఐపీఎల్ 2024లో భాగంగా.. మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్.. 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ చరిత్రలో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన స్పిన్ బౌలర్‌గా చాహల్ నిలిచాడు. 2015లో ఆర్సీబీ తరుఫున ఆడుతున్నప్పుడు ఎక్కువ పరుగులు ఇచ్చాడు. తాజాగా.. తన పాత రికార్డును తానే బద్దలుకొట్టుకున్నాడు.
Peddireddy Ramachandra Reddy: చంద్రబాబువి వీలుకాని హామీలు.. మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమయ్యారు..
నిన్న కేకేఆర్ తో మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లలో చాహల్ అత్యధిక పరుగులు ఇచ్చాడు. చాహల్ తన నాలుగు ఓవర్లలో 54 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. కాగా.. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు అందించిన స్పిన్ బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్ తన పేరును నమోదు చేసుకున్నాడు. చాహల్ ఐపీఎల్ లో అద్భుత స్పెల్ బౌలింగ్ చేయగల సత్త ఉంది. కానీ.. నిన్నటి మ్యాచ్ లో పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు 2011లో మొహాలీలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దివంగత క్రికెటర్ షేన్ వార్న్.. 50 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇప్పుడు అతడిని చాహల్ అధిగమించాడు. ఇదిలా ఉంటే.. రాజస్థాన్ బౌలరల్లో అశ్విన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. నాలుగు ఓవర్ల స్పెల్‌లో వికెట్ పడకుండా 49 పరుగులు ఇచ్చాడు.
MP K.Laxman : కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాంటి దుస్థితి తప్పదు
మరోవైపు.. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీయడానికి యుజ్వేంద్ర చాహల్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు చాహల్ 152 మ్యాచ్‌ల్లో 199 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించడం కోసం కేవలం ఒక్క వికెట్ మాత్రమే కావాలి. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చాహల్ నిలుస్తాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. ప్రస్తుత సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 12 వికెట్లు తీశాడు.