Hardik Pandya: హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పొజిషన్‌తో ఆశ్చర్యపోయా: సెహ్వాగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virender Sehwag Fires on Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ దాదాపుగా ముగిసింది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశాలు ఇప్పుడు లేవు. జట్టు పేలవమైన ప్రదర్శనపై అటు అభిమానులు, ఇటు మాజీల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వ నైపుణ్యాలు, ఫీల్డ్‌లో నిర్ణయాత్మక సామర్ధ్యాల గురించి ప్రశ్నలు తలెత్తాయి. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా హార్దిక్ గురించి స్పందించాడు.
కోల్‌కతాతో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పొజిషన్‌తో వీరేంద్ర సెహ్వాగ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ… ‘ఆండ్రి రస్సెల్‌ను కోల్‌కతా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది. అతడు కేవలం రెండు బంతులు మాత్రమే ఆడాడు. ముంబై తరఫున హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లు లోయర్ ఆర్డర్‌లో వచ్చారు. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఏం సాధిస్తారు?. అప్పటికి ఎన్ని బంతులు మిగిలిఉంటాయి?. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొస్తే మరిన్ని బంతులను ఆడొచ్చు. మ్యాచ్‌ను ఇంకాస్త వేగంగా ముగించే అవకాశం ఉంటుంది’ అని అన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: iPhone 14 Price Drop: ఐఫోన్ 14పై ప్రత్యేక తగ్గింపు.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు!
‘కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోముంబై ఛేజింగ్‌కు దిగింది. టిమ్ డేవిడ్ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. హార్దిక్ పాండ్యా అతడి కంటే ముందు మాత్రమే క్రీజ్‌లోకి వచ్చాడు. అంటే త్వరగా బ్యాటింగ్‌కు వస్తే ఔటైపోతామని భావిస్తున్నారా?. గుజరాత్‌కు ఆడేటప్పుడు హార్దిక్ ఎక్కువగా నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చేవాడు. ఇప్పుడు మాత్రం పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లను ముందుకు పంపి.. అతడు లోయర్‌లో వస్తున్నాడు. ముంబై మేనేజ్‌మెంట్ ఇలాంటి చర్యలపై దృష్టిసారించాలి’ అని వీరూ సూచించాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?