NTV Telugu Site icon

Virender Sehwag: అతనిపై పెట్టుకున్న ఆశలన్నీ బుగ్గిపాలు చేశాడు.. తీసిపారెయ్యండి

Sehwag On Shanaka

Sehwag On Shanaka

Virender Sehwag Fires On Dasun Shanaka For Bad Performance In IPL: ఈ ఐపీఎల్ సీజన్‌లో చాలామంది యంగ్‌స్టర్స్ అద్భుతమైన ప్రదర్శనలతో దూసుకుపోతే.. అంచనాలు పెట్టుకున్న కొందరు స్టార్ ఆటగాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. వండర్స్ క్రియేట్ చేస్తారని భావిస్తే, అందుకు భిన్నంగా చెత్త పెర్ఫార్మెన్స్‌లతో జట్టుకి శాపంలా మారారు. అలాంటి ఆటగాళ్లలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక ఒకరు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ఇతగాడు.. ఈ సీజన్‌లో ఒక్కటంటే ఒక్క గొప్ప ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. కేన్ విలియమ్సన్ స్థానంలో ఈ లీగ్‌లోకి అడుగుపెట్టిన అతగాడు.. తనకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు. ప్రతిసారి ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అతగాడు.. కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్‌-1లో అతని నుంచి అందరూ కీలక ఇన్నింగ్స్ ఆశిస్తే.. కేవలం 17 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ సైతం షనకపై నిప్పులు చెరిగాడు.

Seediri Appalaraju: జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారు.. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన అరిష్టం

ఈరోజు అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫైయర్-2 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘అహ్మదాబాద్‌లో గుజరాత్‌ జట్టుని ఓడించడం అంత సులభం కాదు. ఇంతకుముందు వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో.. ముంబై చేతిలో గుజరాత్‌ ఓటమిపాలైంది. కాబట్టి.. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని హార్దిక్ సేన భావిస్తోంది. అలాంటి జట్టుని ఎదుర్కోవాలంటే.. ముంబై ఇండియన్స్ బాగా కష్టపడాల్సి ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించాలి. ఇప్పుడున్న ముంబై జట్టు పటిష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక గుజరాత్ విషయానికొస్తే.. వారు బౌలింగ్‌ పరంగా పటిష్టంగానే ఉన్నారు కానీ, బ్యాటింగ్‌లో కాస్త నిలకడ లోపించింది. ముఖ్యంగా.. దాసున్ షనక తీవ్ర నిరాశపరిచాడు. అతడి స్థానంలో ఓడియన్ స్మిత్ లేదా అల్జారీ జోసెఫ్‌ను తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే మనోహర్‌కు అవకాశం ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే.. అతడు భారీ సిక్స్‌లు కొట్టగలడు. షనకపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. అతడు నా అంచనాల్లో కనీసం ఒక్క శాతం కూడా చేరుకోలేకపోయాడు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

SSMB28: మహేష్ ఫ్యాన్స్.. సిద్ధం కండమ్మా.. అప్డేట్ వచ్చేసింది