Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
- విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ
- ఆర్సీబీ మరో అద్భుత విజయం
- అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లో ఆరో స్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB Highest Successful Chases: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. ఈ విజయం ఆర్సీబీకి ప్రత్యేకంగా నిలిచింది. ఆర్సీబీ చరిత్రలో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లలో ఇది ఆరో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆర్సీబీ అత్యధిక విజయవంతమైన ఛేజ్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 228 పరుగులుగా ఉంది.
కోల్‌కతాపై బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 19.1 ఓవర్లలోనే ఛేదించింది. కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. కింగ్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. కోహ్లీ ఈ ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడంతో పాటు.. ఐపీఎల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుల రికార్డును కూడా సమం చేశాడు. ఛేజింగ్ మాస్టర్ కోహ్లీ రన్స్ కొడితే.. అర్సిబీ తప్పకుండా గెలుస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఐపీఎల్ చరిత్రలో లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒత్తిడి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం, భారీ లక్ష్యాలను సులభంగా ఛేజ్ చేయించడం, చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చడం కోహ్లీకి అలవాటే. ముఖ్యంగా ఆర్సీబీ భారీ లక్ష్యాలను ఛేదించిన మ్యాచుల్లో కోహ్లీ కీలక పాత్ర పోషించిన గణాంకాలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌ల జాబితాను పరిశీలిస్తే.. దాదాపు ప్రతి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్య ఛేదనలో కింగ్ పరుగులు చేస్తే ఆర్సీబీ విజయం దాదాపు ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో బలపడుతోంది. ఇటీవల రాయ్‌పూర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన మ్యాచ్ దీనికి తాజా ఉదాహరణగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ అజేయ సెంచరీతో చెలరేగి ఆర్సీబీకి అద్భుత విజయాన్ని అందించాడు.
ఆర్సీబీ విజయవంతమైన ఛేజింగ్‌లలో కోహ్లీ ప్రదర్శనలు:
228 vs లక్నో సూపర్ జెయింట్స్, లక్నో (2025) – విరాట్ కోహ్లీ 54(30)
206 vs గుజరాత్ టైటాన్స్, బెంగళూరు (2026) – విరాట్ కోహ్లీ 81(44)
204 vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్, బెంగళూరు (2010) – విరాట్ కోహ్లీ 16*(12)
202 vs సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు (2026) – విరాట్ కోహ్లీ 69*(38)
201 vs గుజరాత్ టైటాన్స్, అహ్మదాబాద్ (2024) – విరాట్ కోహ్లీ 70*(44)
193 vs కోల్‌కతా నైట్ రైడర్స్, రాయ్‌పూర్ (2026) – విరాట్ కోహ్లీ 105*(60)
తాజావార్తలు
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!