Virat Kohli Duck: మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్.. కింగ్‌ను సున్నాకే పెవిలియన్‌కు పంపిన బౌలర్లు వీరే!
- మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్
- వరుసగా రెండో మ్యాచ్‌లో కింగ్ డకౌట్
- ఐపీఎల్‌లో కోహ్లీని డకౌట్ చేసిన బౌలర్ల జాబితా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Duck vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక విజయాన్ని అందుకుంది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ చివరి బంతికి 2 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి డకౌట్ కావడమే. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై సున్నాకే ఔటైన కోహ్లీ.. ఇప్పుడు ముంబైపై కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. ముంబై పేసర్ దీపక్ చహర్ వేసిన ఓవర్‌లో కోహ్లీ షాట్ ఆడగా.. మిడాఫ్‌లో రాజ్ బవా అద్భుత డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. దాంతో ఐపీఎల్‌లో కోహ్లీని డకౌట్ చేసిన బౌలర్ల జాబితాలో ఇప్పుడు చహర్ కూడా చేరాడు. ఈ జాబితాలో ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నాథన్ కౌల్టర్ నైల్, ట్రెంట్ బౌల్ట్ వంటి దిగ్గజాలు ఉన్నారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ డకౌట్ కావడం అభిమానులను నిరాశకు గురి చేసినప్పటికీ.. జట్టు విజయం మాత్రం ఆర్సీబీ అభిమానులకు ఊరటనిచ్చింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ రేసులో బలమైన స్థితిలో నిలిచింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీని డకౌట్ చేసిన బౌలర్లు:
2008 – ఆశిష్ నెహ్రా (ముంబై ఇండియన్స్)
2014 – జహీర్ ఖాన్ (ముంబై ఇండియన్స్)
2014 – భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
2014 – సందీప్ శర్మ (పంజాబ్ కింగ్స్)
2016 – ధవల్ కులకర్ణి (గుజరాత్ లయన్స్)
2017 – నాథన్ కౌల్టర్ నైల్ (కేకేఆర్)
2022 – దుష్మంత చమీరా (లక్నో సూపర్ జెయింట్స్)
2022 – మార్కో జాన్సెన్ (ఎస్‌ఆర్‌హెచ్)
2022 – జగదీశ సుచిత్ (ఎస్‌ఆర్‌హెచ్)
2023 – ట్రెంట్ బౌల్ట్ (రాజస్థాన్ రాయల్స్)
2026 – ప్రిన్స్ యాదవ్ (లక్నో సూపర్ జెయింట్స్)
2026 – దీపక్ చహర్ (ముంబై ఇండియన్స్)
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!