NTV Telugu Site icon

Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి.. 17 ఏళ్ల ఐపీఎల్‌లో మొదటి క్రికెటర్!

Virat Kohli 8000 Runs

Virat Kohli 8000 Runs

RCB Star Virat Kohli Scripts History in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్‌లో 8000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ రికార్డుల్లో నిలిచాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కింగ్ ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌లో కోహ్లీ 24 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 33 రన్స్ చేశాడు. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో 8 వేల రన్స్ చేసిన మొదటి క్రికెటర్ కోహ్లీనే.

ఐపీఎల్‌లో 252 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ.. 244 ఇన్నింగ్స్‌లలో 8004 రన్స్ బాదాడు. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ అత్యధిక స్కోర్ 113 కాగా.. 705 ఫోర్లు, 272 సిక్సులు కొట్టాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి విరాట్ ఆర్‌సీబీ తరపునే ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఓ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. అంతేకాదు ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ కోహ్లీనే.

Also Read: Dinesh Karthik Retirement: ఐపీఎల్‌కు దినేష్ కార్తీక్‌ గుడ్ బై!

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అనంతరం అత్యధిక పరుగుల చేసిన ఆటగాడు శిఖర్ ధావన్. గబ్బర్ 222 మ్యాచ్‌లలో 6769 రన్స్ చేశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (6628), డేవిడ్ వార్నర్ (6565), సురేష్ రైనా (5528), ఎంఎస్ ధోనీ (5243), ఏబీ డివిలియర్స్ (5162) ఉన్నారు. వేరు మాత్రమే ఐపీఎల్‌లో 5 వేల కంటే ఎక్కువ రన్స్ చేశారు.