Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి.. 17 ఏళ్ల ఐపీఎల్లో మొదటి క్రికెటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB Star Virat Kohli Scripts History in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్లో 8000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ రికార్డుల్లో నిలిచాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కింగ్ ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌లో కోహ్లీ 24 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 33 రన్స్ చేశాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 8 వేల రన్స్ చేసిన మొదటి క్రికెటర్ కోహ్లీనే.
ఐపీఎల్లో 252 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ.. 244 ఇన్నింగ్స్‌లలో 8004 రన్స్ బాదాడు. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ అత్యధిక స్కోర్ 113 కాగా.. 705 ఫోర్లు, 272 సిక్సులు కొట్టాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి విరాట్ ఆర్సీబీ తరపునే ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో ఓ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. అంతేకాదు ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ కోహ్లీనే.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Dinesh Karthik Retirement: ఐపీఎల్‌కు దినేష్ కార్తీక్ గుడ్ బై!
ఐపీఎల్లో విరాట్ కోహ్లీ అనంతరం అత్యధిక పరుగుల చేసిన ఆటగాడు శిఖర్ ధావన్. గబ్బర్ 222 మ్యాచ్‌లలో 6769 రన్స్ చేశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (6628), డేవిడ్ వార్నర్ (6565), సురేష్ రైనా (5528), ఎంఎస్ ధోనీ (5243), ఏబీ డివిలియర్స్ (5162) ఉన్నారు. వేరు మాత్రమే ఐపీఎల్లో 5 వేల కంటే ఎక్కువ రన్స్ చేశారు.
EIGHT THOUSAND runs in the IPL. 🤯
We are out of adjectives, really! 🐐#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB #ViratKohli pic.twitter.com/PxkuCF0GK9
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 22, 2024
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!