Virat Kohli: 37 ఏళ్ల వయస్సులోనూ ఎలాగబ్బా.. కింగ్ విరాట్ కోహ్లీకి ‘టేక్‌ ఏ బౌ’!

  • మరోసారి తన క్లాస్‌ను నిరూపిస్తున్న విరాట్ కోహ్లీ
  • ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి 49 పరుగుల ఇన్నింగ్స్‌
  • ఆర్‌సీబీ తరఫున 5 మ్యాచ్‌లలో 228 పరుగులు
  • 38 ఏళ్ల వయస్సులోనూ ఎలాగబ్బా
Virat Kohli Orange Cap

Virat Kohli Orange Cap

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను నిరూపిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి 49 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆర్‌సీబీ తరఫున 5 మ్యాచ్‌లలో 228 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. కింగ్ సగటు 57.00గా, స్ట్రైక్ రేట్ 158.33గా ఉంది. టీ20 ఇంటర్నేషనల్స్‌కు 2024లో గుడ్‌బై చెప్పినా, ఇతర టీ20 లీగ్‌ల్లో ఆడకున్నా, కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమైన కోహ్లీ.. ఐపీఎల్‌ 2026లో అద్భుతంగా రాణిస్తుండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. మ్యాచ్‌లు ఉన్నపుడు మాత్రమే భారత్ వస్తున్నాడు. భారతదేశ పరిస్థితులకు భిన్నమైన వాతావరణంలో లండన్‌లో నివసిస్తూ, ఐపీఎల్ 2026 ప్రారంభానికి కేవలం 15 రోజుల ముందు మాత్రమే భారత్‌కు రావడం వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ.. కోహ్లీ తన ఫిట్‌నెస్, ఫామ్‌ను అద్భుతంగా మేనేజ్ చేస్తున్నాడు. అంతేకాదు టోర్నీకి ముందు పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేకపోయినా బ్యాటింగ్‌లో ఎక్కడా తడబడడం లేదు. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.

యువ ఆటగాళ్లతో పోటీ పడుతూ.. 37 ఏళ్ల వయస్సులో కూడా విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. 2008లో టీమిండియాలోకి వచ్చినా.. ఇప్పటికీ కింగ్‌లో అదే ఉత్సాహం, అదే పరుగుల దాహం ఉండడం విశేషం. విరాట్ అనుభవం, ఫిట్‌నెస్, కట్టుదిట్టమైన క్రమశిక్షణ ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ప్రస్తుత క్రికెట్‌లో వేగంగా మారుతున్న పరిస్థితుల్లో, యువ ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో కోహ్లీ ఇలా రాణించడం అతని గొప్పతనాన్ని మరోసారి చాటుతోంది. ఈ ఫామ్ కొనసాగితే.. ఐపీఎల్ 2026లో కూడా కోహ్లీ గట్టి ముద్ర వేయడం ఖాయం.