Site icon NTV Telugu

MI vs KKR: రాణించిన వెంకటేశ్ అయ్యర్, మనీష్ పాండే.. ముంబై టార్గెట్ ఎంతంటే..?

Kkr

Kkr

ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా.. ముంబై ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. 19.5 ఓవర్లలో కేకేఆర్ 169 పరుగులు చేసి ఆలౌటైంది. కోల్కతా బ్యాటింగ్ లో వెంకటేష్ అయ్యర్ (70), ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మనీష్ పాండే (42) పరుగులతో రాణించడంతో.. కోల్కతా ఫైటింగ్ స్కోరు చేయగలిగింది. టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ చివరకు వరకు ఉండి జట్టు స్కోరు పెంచాడు. అతనితో పాటు మనీష్ పాండే రాణించడంతో.. వారి మధ్య మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Amit Shah fake video case: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్..

కోల్కతా బ్యాటింగ్లో వెంకటేష్ అయ్యర్ అత్యధికంగా (70) పరుగులు చేశాడు. ఆ తర్వాత మనీష్ పాండే (42) పరుగులతో రాణించాడు. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (5), సునీల్ నరైన్ (8) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన రఘువంశీ (13), శ్రేయాస్ అయ్యర్ (6) పరుగులు చేసి నిరాశ పరిచారు. ఫినిషర్ రింకూ సింగ్ (9) ఆకట్టుకోలేకపోయాడు. రస్సెల్ (7) పరుగులు చేసి రనౌట్ రూపంలో ఔటయ్యాడు. రమన్ దీప్ సింగ్ (2), మిచెల్ స్టార్క్ డకౌట్ అయ్యాడు. ముంబై బౌలింగ్ లో బుమ్రా, నువాన్ తుషార్ చెరో 3 వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా 2 వికెట్లతో ఆకట్టుకోగా, పీయూష్ చావ్లా ఒక వికెట్ పడగొట్టాడు.

Chinaman: కార్మికులను బెల్టుతో తీవ్రంగా కొట్టిన చైనా వ్యక్తి.. చివరకు.. వీడియో వైరల్..

Exit mobile version