Vaibhav Sooryavanshi: భారీగా డిమాండ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇక నుంచి డబ్బే డబ్బు!
- భారత క్రికెట్లో కొత్త సంచలనంగా వైభవ్
- ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్
- భారీగా డిమాండ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌తో భారత క్రికెట్లో కొత్త సంచలనంగా అవతరించిన వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మైదానానికే పరిమితం కాలేదు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ 15 ఏళ్ల యువ ఆటగాడు.. ఇప్పుడు బ్రాండ్ ఎండార్స్మెంట్ ప్రపంచంలోనూ హాట్ ప్రాపర్టీగా మారాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత వైభవ్ బ్రాండ్ విలువ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2026లో ఆడిన వైభవ్ సూర్యవంశీ.. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లపై విరుచుకుపడిన బుడ్డోడు.. ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అతడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ప్రస్తుతం రాయల్స్‌తో వైభవ్‌కు ఏడాదికి రూ.1.10 కోట్ల ఒప్పందం ఉంది. అయితే అతని ఐపీఎల్ జీతం పెరిగేందుకు ఇంకా కొంత సమయం పట్టొచ్చు. కానీ బ్రాండ్ ఎండార్స్మెంట్ మార్కెట్లో మాత్రం అతని డిమాండ్ ఇప్పటికే భారీగా పెరిగిపోయింది.
Also Read
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
తెలిసిన సమాచారం ప్రకారం.. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు వైభవ్ సూర్యవంశీ ఒక్కో బ్రాండ్ ఒప్పందానికి దాదాపు రూ.1 కోటి తీసుకున్నాడు. ఇప్పుడు ఒక్కో డీల్‌కు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. వైభవ్ ఇప్పటికే ప్రముఖ బ్రాండ్లు అయిన కాంప్లాన్, రెడ్ బుల్ ప్రకటనల్లో కనిపించాడు. ఐపీఎల్లో అతని అద్భుత ప్రదర్శన తర్వాత మరెన్నో కంపెనీలు అతనితో ఒప్పందాలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం అతని బ్రాండ్ పోర్ట్‌ఫోలియోను కుటుంబ సభ్యులే నిర్వహిస్తున్నప్పటికీ.. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా ఈ విషయంలో సహకరిస్తున్నట్లు సమాచారం.
వైభవ్ కెరీర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ వయసులోనే వచ్చిన అపారమైన గుర్తింపు, భారీ ఆర్థిక అవకాశాలను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. అతని ప్రతిభను చూసి ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అతడిని సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలతో పోలుస్తున్నారు. అయితే ప్రతిభ ఎంత ఉన్నా.. అంతర్జాతీయ స్థాయిలో స్థిరంగా రాణించడం, అన్ని ఫార్మాట్లలో తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం వైభవ్ భారత క్రికెట్లో అత్యంత విలువైన యువ బ్రాండ్‌గా ఎదుగుతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!