Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బలహీనత తెలిసిపోయింది.. ఇక ఐపీఎల్ 2026లో ‘బుడ్డోడి’కి కష్టమే?
- వైభవ్‌ను డకౌట్ చేసిన ప్రఫుల్ హింగే
- వైభవ్ సూర్యవంశీ బలహీనత తెలిసిపోయింది
- ఐపీఎల్ 2026లో వైభవ్‌కు కష్టమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praful Hinge Exposed Vaibhav Sooryavanshi Weakness: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున ఆడుతున్న వైభవ్.. ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో 200 పరుగులు చేశాడు. 260కి పైగా అధిక స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేయడం విశేషం. బౌలర్లకు పెను సవాల్‌గా మారుతున్న సమయంలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పేసర్ ప్రఫుల్ హింగే మొదటి బంతికే వైభవ్‌ను డకౌట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎస్ఆర్హెచ్ తరఫున అరంగేట్రం చేసిన హింగే.. ముందుగానే వేసుకున్న ప్లాన్‌ను చక్కగా అమలు చేసి వైభవ్‌ను గోల్డెన్ డక్‌గా ఔట్ చేయడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్ఆర్కు నిర్ధేశించింది. అందరూ వైభవ్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రఫుల్ హింగే మొదటి బంతికే అతడిని పెవిలియన్‌కు పంపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హింగే.. వైభవ్‌ను బౌన్సర్‌తో లేదా మరో విధంగా ఔట్ చేస్తానని తన సన్నిహితులకు ముందుగానే చెప్పానని వెల్లడించాడు. అతడు వ్యాఖ్యలు సిల్లీగా అనిపించినా.. అమలు చేయడం మాత్రం అంత ఈజీ కాదు. కానీ చెప్పినట్లే వైభవ్‌ను అవుట్ చేసి క్రికెట్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ప్రఫుల్ హింగే విజయానికి కారణం అతని లైన్-లెంగ్త్ కచ్చితత్వమే అని ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ చీఫ్ కోచ్ ఎం.సెంథిల్ నాథన్ చెప్పారు. ఆధునిక క్రికెట్లో బ్యాటర్ బలహీనతలను గుర్తించడం పెద్ద విషయం కాదని, కానీ వాటిని మైదానంలో అమలు చేయడం కీలకమని పేర్కొన్నారు. హింగే సరిగ్గా అదే చేశాడని ఆయన చెప్పారు. హై బ్యాక్లిఫ్ట్తో ఆడడం, ఫ్రంట్ లెగ్‌ను ముందుకేసి భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేయడం వైభవ్ బలహీనత అని నిపుణులు అంటున్నారు. ఈ కారణంగా స్టంప్స్‌పై లేదా శరీరానికి దగ్గరగా వేసే బంతులకు అతడిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. హింగే అదే వ్యూహాన్ని అనుసరించి.. హార్డ్ లెంగ్త్ బంతితో అతడిని బోల్తా కొట్టించాడు.
హింగే మాదిరి ఇతర స్టార్ బౌలర్లు ప్రయత్నించినప్పటికీ.. అమలులో చిన్న తప్పిదాలు చేశారు. టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన బౌన్సర్ కొద్దిగా తక్కువలో రావడంతో వైభవ్‌కు టైమ్ దొరికింది. ఆసీస్ స్టార్ జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతి కూడా బ్యాటర్‌కు అనుకూలంగా వచ్చింది. కానీ హింగే మాత్రం తన లెంగ్త్‌ను కచ్చితంగా వేసి.. వైభవ్‌కు స్పేస్ ఇవ్వకుండా ఔట్ చేశాడు. వైభవ్‌ను హింగే అవుట్ చేసిన అనంతరం అందరిలో ఓ ప్రశ్న తలెత్తుతోంది. ఇకపై మిగతా బౌలర్లు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించనున్నారు. బౌలర్లు వైభవ్ బలహీనతలను టార్గెట్ చేస్తే.. వాటిని అధిగమించి తిరిగి ఎలా రాణిస్తాడన్నది చూడాలి. ప్రతిభ ఎంత ఉన్నా.. కచ్చితమైన ప్లాన్, అద్భుతమైన ఎగ్జిక్యూషన్ ముందు ఏ బ్యాటర్ అయినా అవుట్ అకావాల్సిందే అని హింగే నిరూపించాడు.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..