Mohsin Khan troubled Vaibhav Sooryavanshi in IPL 2026: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం అంతాఇంతా కాదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న బుడ్డోడు.. అంతర్జాతీయ స్థాయి స్టార్ బౌలర్లను కూడా వదలడం లేదు. ఏమాత్రం బెరుకు లేకుండా ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వేగం, స్వింగ్, బౌన్స్ ఏదైనా సరే.. వైభవ్ బ్యాట్ ముందు బౌలర్లు చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్లుగా పేరున్న పేసర్లపై అతడు విరుచుకుపడుతున్న తీరు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై వైభవ్ సూర్యవంశీ పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. కమిన్స్ బౌలింగ్‌లో కేవలం 16 బంతుల్లోనే 61 పరుగులు బాదాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో ఆస్ట్రేలియా స్టార్ పేసర్‌కు చుక్కలు చూపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన 19 బంతుల్లో 38 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో 13 బంతులు ఎదుర్కొని.. 36 పరుగులు బాదాడు. వైభవ్ దూకుడు ముందు ఈ ముగ్గురు స్టార్ బౌలర్లు సాధారణ బౌలర్లలా కనిపించారు.
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా వైభవ్ వదల్లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ యార్కర్ స్పెషలిస్టుగా పేరున్న బుమ్రా.. బుడ్డోడి ధాటికి 5 బంతుల్లో 13 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ 4 బంతుల్లో 18 పరుగులు ఇచ్చాడు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ మార్కో జాన్సెన్ 10 బంతుల్లో 23 పరుగులు, మహ్మద్ సిరాజ్ 10 బంతుల్లో 18 పరుగులు ఇచ్చారు. బంతి ఎక్కడ పడినా బౌండరీకి పంపిస్తూ తన పవర్ హిట్టింగ్‌తో వైభవ్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో 5 బంతుల్లో 16 పరుగులు, కగిసో రబడా బౌలింగ్‌లో 7 బంతుల్లో 16 పరుగులు, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో 8 బంతుల్లో 18 పరుగులు వైభవ్ చేశాడు. ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లను కూడా వైభవ్ ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాడో ఈ గణాంకాలే చెబుతున్నాయి. ముఖ్యంగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో వచ్చే బంతులను కూడా సిక్సర్లుగా మలుస్తూ టీ20 క్రికెట్‌లో కొత్త సంచలనం సృష్టిస్తున్నాడు. అయితే ఐపీఎల్ 2026లో వైభవ్‌ను కట్టడి చేసిన ఓ బౌలర్ కూడా ఉన్నాడు. అతడే క్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్.
మొహ్సిన్ బౌలింగ్‌లో వైభవ్ పరుగులు చేయలేకపోయాడు. 12 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు.. ఈ సీజన్‌లో రెండు సార్లు బుడ్డోడిని మొహ్సిన్ ఔట్ కూడా చేశాడు. ప్రపంచ స్థాయి బౌలర్లందరిపై దాడి చేసిన వైభవ్‌ను మొహ్సిన్ మాత్రం అద్భుత లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో కట్టడి చేశాడు. దీంతో వైభవ్‌కు అసలైన మొగుడు మొహ్సిన్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ 2026లో వైభవ్ 680 పరుగులతో పరుగుల వరద పారించాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రెచ్చిపోయిన అతడు.. క్వాలిఫైయర్-2లో కూడా చెలరేగేందుకు సిద్దమయ్యాడు.
