Vaibhav Sooryavanshi Talent: రాహుల్ ద్రవిడ్ కాదు.. వైభవ్ సూర్యవంశీ టాలెంట్‌ను మొదట గుర్తించింది ఇతడే!
- ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
- 15 మ్యాచ్‌లలో 680 పరుగులు
- వైభవ్ గురించి వెలుగులోకి ఆసక్తికర విషయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi’s talent was first spotted by Samar Quadri: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం గురించి ఇప్పుడు ప్రపంచ క్రికెట్ మాట్లాడుకుంటోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున ఆడుతూ.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన బుడ్డోడు.. 47.14 అద్భుత సగటు, 242.85 స్ట్రైక్‌రేట్‌తో 680 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 65 భారీ సిక్సర్లు బాదటం వైభవ్ విధ్వంసక బ్యాటింగ్‌కు నిదర్శనం. అద్భుతంగా ఆడుతున్న బుడ్డోడు.. ఆర్ఆర్, భారత భవిష్యత్తు స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే వైభవ్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్‌కు తీసుకొచ్చింది మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ అని చాలామంది భావిస్తుంటారు. కానీ బుడ్డోడి టాలెంట్‌ను తొలిసారి గుర్తించింది బిహార్ మాజీ స్పిన్నర్, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ నెట్ బౌలర్‌గా పనిచేస్తున్న సమర్ ఖాద్రి. ఓ లోకల్ మ్యాచ్‌లో చిన్న వయసులోనే వైభవ్ భారీ సిక్సర్లు బాదుతుండటాన్ని చూసి సమర్ ఆశ్చర్యపోయాడట. అప్పుడే ఈ కుర్రాడిలో అసాధారణ ప్రతిభ ఉందని గుర్తించాడు. ఆ తర్వాత ఒకసారి రాజస్థాన్ రాయల్స్ మాస్టర్‌మైండ్ జుబిన్ భరూచా.. టాలెంటెడ్ యువ ఆటగాళ్లను గుర్తించాలని సమర్ ఖాద్రికి సూచించాడు. వెంటనే అతడు వైభవ్ పేరును చెప్పాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
సమర్ ఖాద్రి చెప్పడంతో వైభవ్‌ను చెన్నైలో నిర్వహించిన స్కౌటింగ్ ట్రయల్స్‌కు ఆర్ఆర్ కోచింగ్ స్టాఫ్ పిలిచింది. అక్కడ బుడ్డోడు తన బ్యాటింగ్‌తో అందరినీ షాక్‌కు గురిచేశాడు. కేవలం 60 బంతుల్లోనే 150కి పైగా పరుగులు బాదటమే కాకుండా.. 150 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతులను కూడా సిక్సర్లుగా మలిచాడు. ఆ ఇన్నింగ్స్ చూసిన రాజస్థాన్ మేనేజ్మెంట్, కోచ్‌లు ఫిదా అయిపోయారు. దీంతో 2024లో సూర్యవంశీని రూ.1.10 కోట్లకు ఆర్ఆర్ కొనుగోలు చేసింది. అయితే అతడు 2024 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. జట్టు అతడిని భవిష్యత్తు కోసం సిద్ధం చేసింది. అనంతరం 2025 సీజన్లో వైభవ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన తొలి సీజన్లోనే 7 మ్యాచ్‌లలో 252 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 36.00 సగటు, 206.55 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన అతడు భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడనే సంకేతాలు అప్పుడే ఇచ్చాడు.
ఇక ఇప్పుడు ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ నుంచి పరుగుల వరద పారుతోంది. ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా ఎలాంటి బెరుకు లేకుండా ఎదుర్కొంటూ మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపిస్తున్నాడు. బుమ్రా, బౌల్ట్, భువీ, షమీ, సిరాజ్, కమిన్స్, హేజిల్‌వుడ్, రబాడ, నరైన్ లాంటి టాప్ బౌలర్లను కూడా వదలలేదు. మొదటి బంతి నుంచి బౌలర్లపై విరుచుకుపడుతూ చూస్తుండగానే హాఫ్ సెంచరీ, సెంచరీ బాదేస్తున్నాడు. బౌలర్లను ఊచకోత కోస్తూ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాడు. త్వరలోనే భారత జట్టుకు కూడా ఎంపిక కావడం ఖాయమనే చర్చలు మొదలయ్యాయి. ఈ స్థాయికి చేరడానికి కారణమైన సమర్ ఖాద్రి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక లోకల్ మ్యాచ్‌లో గుర్తించిన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన సమర్ ఖాద్రిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
-
Team India: ఆ చెత్త ప్లేయర్స్ ఎందుకు.. వెంటనే టీమిండియాలో నుంచి తీసేయండి!
-
Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రావ్ బహదూర్’.. త్వరలోనే స్ట్రీమింగ్
-
Flipkart Freedom Sale 2026: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ డేట్ ఫిక్స్.. iPhone 17, Galaxy S25పై భారీ డీల్స్
-
ED Raids: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్‌గా మోసాలు.!
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!