Rajasthan Royals FIR: వైభవ్ సూర్యవంశీ వివాదం.. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీపై ఎఫ్‌ఐఆర్ నమోదు!
- దుమ్మురేపే ప్రదర్శన చేస్తున్న వైభవ్ సూర్యవంశీ
- రాయల్స్ తరఫున 10 మ్యాచ్‌లలో 404 రన్స్
- చట్టపరమైన చర్చలకు కేంద్రబిందువుగా వైభవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIR Threat Against Rajasthan Royals: ఐపీఎల్ 2026 సీజన్‌లో 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపే ప్రదర్శన చేస్తున్నాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున 10 మ్యాచ్‌లలో 404 రన్స్ బాదాడు. 237కు పైగా విధ్వంసకర స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌పై 37 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ప్రస్తుతం వైభవ్ ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచాడు. అయితే అద్భుత ఆటతో అలరిస్తున్న ఈ యువ సంచలనం ఇప్పుడు చట్టపరమైన చర్చలకు కేంద్రబిందువుగా మారాడు.
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్‌లో ఆడిస్తున్నందుకు రాజస్తాన్ రాయల్స్ టీమ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తానని కర్ణాటకకు చెందిన సామాజిక కార్యకర్త శివకుమార్ నాయక్ హెచ్చరించాడు. రాజస్థాన్‌లో బాల కార్మిక వ్యవస్థ ఉందని ఆయన ఆరోపించారు. 15 ఏళ్ల వయసులో వైభవ్ క్రికెట్ ఆడటం మానేసి చదువుపై దృష్టి పెట్టాలని శివకుమార్ అన్నారు. 18 సంవత్సరాల లోపు ఉన్న బాలుడు ప్రొఫెషనల్ లీగ్‌లో ఆడటం చైల్డ్ లేబర్ కిందకి వస్తుందని ఆయన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ ఫ్రాంచైజీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించడం సంచలనంగా మారింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
‘వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడు 15 ఏళ్లు. ఈ వయసులో పిల్లలతో ఆడుకుంటూ, చదువుకుంటూ గడపాలి. ట్రైయినింగ్, ప్రాక్టీస్, ఐపీఎల్ మ్యాచ్.. అన్ని అతడిని ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత స్ట్రెస్ తీసుకోవడం సరైంది కాదు. ఐపీఎల్‌లో రాణించడంతో అంతర్జాతీయ క్రికెట్ కూడా ఆడించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇది ఛైల్డ్ లేబర్‌తో సమానం. ఈ వయసులో సీనియర్ ప్లేయర్లతో సమానంగా ఆడడం కరెక్ట్ కాదు. ఐపీఎల్ కారణంగా వైభవ్ 10వ తరగతి పరీక్షలు రాయలేకపోయాడు. ఫ్రెండ్స్‌తో కలిసి స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడు. క్రికెట్ సహా చదువు కూడా చాలా ముఖ్యం. అందుకే ఐపీఎల్‌లో ఆడిస్తున్నందుకు రాజస్తాన్ రాయల్స్‌పై బాల కార్మికుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తా. వైభవ్ హక్కుల కోసం న్యాయ పోరాటానికి దిగుతా’ అని శివకుమార్ అంటున్నారు.
అయితే క్రికెట్ వర్గాల్లో మాత్రం ఈ ఆరోపణలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు నిపుణులు చెబుతున్నదేమిటంటే.. క్రీడల్లో చిన్న వయస్సులోనే ప్రతిభను ప్రోత్సహించడం సాధారణమేనని, ఇది చైల్డ్ లేబర్‌గా పరిగణించడం సరైనది కాదని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడాకారులు చిన్న వయస్సులోనే ప్రొఫెషనల్ స్థాయిలో ఆడిన ఉదాహరణలు ఉన్నాయి. మరోవైపు ఐపీఎల్ వంటి భారీ వేదికలో పాల్గొనడం వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. చిన్న వయస్సులోనే ఇంతటి పోటీని ఎదుర్కోవడం వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!