NTV Telugu Site icon

CSK- IPL 2025: రిటెన్షన్‌ను సీఎస్కే చాలా అద్భుతంగా వినియోగించుకుంది..

Csk

Csk

CSK- IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్‌ ఐపీఎల్‌ రిటెన్షన్‌ అనుకున్నట్లుగానే కొనసాగింది. ‘కెప్టెన్ కూల్’ఎంఎస్ ధోనీని అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గానే సీఎస్కే తీసుకుంది. కేవలం 4 కోట్ల రూపాయలకే ధోనీకి చెల్లించనుంది. దీంతో మెగా వేలానికి ముందు చెన్నైకు సుమారు రూ.10 నుంచి రూ. 15 కోట్ల వరకు అదనంగా డబ్బు మిగిలిందని టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్ కైఫ్ కామెంట్స్ చేశారు. మెగా వేలంలో స్టార్‌ క్రికెటర్లను దక్కించుకొనే వెసులుబాటు కలిగిందని చెప్పుకొచ్చారు.

Read Also: Free Gas Scheme: ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు!

అలాగే, చెన్నై చాలా అద్భుతంగా రిటెన్షన్‌ను వాడుకుంది. అన్‌క్యాప్‌డ్‌ రూల్‌ను వెనక్కి తీసుకురావడం వారికి కలిసొచ్చింది అని మాజీ క్రికెటర్ కైఫ్ చెప్పారు. ధోనీ మరొక సీజన్‌ ఆడాలని మనం కూడా బలంగా కోరుకుంటున్నాం.. అతడిని మైదానంలో చూడటం ఆనందంగా ఉందన్నారు. సీఎస్కే ఈ విషయంలో చాలా స్మార్ట్‌గా వ్యవహరించిందన్నారు. తక్కువ మొత్తానికే ధోనీని తీసుకుంది.. భారత్‌ జట్టుకు నేను చివరి మ్యాచ్‌ ఆడేటప్పటికి నా వయసు 36 కాగా.. ఒక్క మ్యాచ్‌ ఆడినా అది ఇంటర్నేషనల్‌ అరంగేట్రం చేసినట్లే అన్నారు. ఒకవేళ నన్ను జట్టులో నుంచి తీసేసి పక్కన పెట్టినా ఐపీఎల్‌లో మాత్రం అద్భుతంగా ఆడుతున్నా.. అప్పుడు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ రూల్‌ నాకు వర్తించదని చెప్పుకొచ్చారు. ఇది కేవలం అంతర్జాతీయ మ్యాచులను ఆడ నివారికి మాత్రమే కావాలని మహ్మద్ కైఫ్ పేర్కొన్నారు.

Read Also: Vikkatakavi : తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ లో రిలీజ్ కానున్న‘వికటకవి’

అయితే, మహేంద్ర సింగ్ ధోనీని అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా రిటైన్ చేసుకోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐపీఎల్‌లో ఈ రూల్‌ను ధోనీ కోసమే తీసుకోచ్చారనే అనుమానం కలుగుతుంది.. ఒకవేళ ఇప్పుడు మళ్లీ మనిద్దరం ఆడాలనుకుంటే అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లం అవుతామని మంజ్రేకర్ పేర్కొన్నారు. కాగా, సీఎస్కే ధోనీతో పాటు కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్, రవీంద్ర జడేజా, పతిరన, శివమ్‌ దూబెను రిటైన్‌ చేసుకున్నట్లు వెల్లడించింది.