Site icon NTV Telugu

Virat Kohli: కోహ్లీ రికార్డుల మోత.. ఖాతాలో మరో రెండు

Kohli

Kohli

టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు సాధించారు. టీ20ల్లో అత్యధికంగా 50 ప్లస్ రన్స్ చేసిన తొలి టీమిండియా క్రికెటర్ గా రికార్డ్ సృష్టించారు. ఈరోజు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశారు. అంతేకాకుండా.. ఈ మ్యాచ్ లోనే అత్యధిక క్యాచ్ లు (173) అందుకున్న భారత ఆటగాడిగాను అవతరించారు. బెయిర్ స్టో ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో ఈ ఘనత సాధించాడు. ఇదే మ్యాచ్ లో కోహ్లీ మరో క్యాచ్ అందుకున్నాడు. కోహ్లీ తర్వాత క్యాచ్ లు అందుకున్న వారిలో రైనా (172), రోహిత్ (167) ఉన్నారు.

Somu Veerraju: మాజీ అధ్యక్షుడి పోటీపై క్లారిటీ.. మంగళవారం అధికారిక ప్రకటన!

ఇక.. మ్యాచ్ విషయానికొస్తే, 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు.. విరాట్ కోహ్లీ 77 పరుగులు చేసి ఔటయ్యాడు. బెంగళూరు బ్యాటింగ్ లో డుప్లెసిస్ (3), గ్రీన్ (3), పాటిదర్ (18), మ్యాక్స్ వెల్ (3), అనూజ్ రావత్ (11) పరుగులు చేశారు. పంజాబ్ బౌలింగ్ లో రబాడ, హర్ ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సామ్ కరన్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఈ వార్త రాసే సమయానికి బెంగళూరు 17 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది.

Simon Harris: ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి.. చిన్న వయసులో కీలక బాధ్యతలు

Exit mobile version