Site icon NTV Telugu

IPL 2025 Final: ఐపీఎల్‌ ఫైనల్‌లో ‘ఆపరేషన్ సింధూర్‌’ స్పెషల్‌.. వారికి బీసీసీఐ ఆహ్వానం

Ipl

Ipl

IPL 2025 Final: ఐపీఎల్ 2025 తుది దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈసారి తుది పోరు మరింత ప్రత్యేకంగా కనిపించబోతుంది. ఇందుకోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ను విజయవంతం చేసిన మన భద్రతా దళాలను ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా సత్కరించాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు వారికి ఇప్పటికే ఆహ్వానాలను పంపించినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా తెలిపారు.

Read Also: Manchu Vishnu: నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?

అయితే, ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో ఇండియన్ ఆర్మీ ప్రదర్శించిన శౌర్య, పరాక్రమాలు.. దేశ రక్షణ కోసం వారి నిస్వార్థ సేవ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని బీసీసీఐ తెలిపింది. అందుకే, ఐపీఎల్ ముగింపు వేడుకల్లో మన భద్రతా దళాలను గౌరవించుకోవడానికి అంకితం ఇచ్చామని పేర్కొంది. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కె.త్రిపాఠి, వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌, మిలిటరీ టాప్‌ ర్యాంక్‌ అధికారులు, పలువురు జవాన్లను ముగింపు వేడుకలకు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. క్రికెట్‌ అంటే ఎంతో మందికి ఇష్టం.. కానీ, దేశ భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదని దేవజిత్ సైకియా వెల్లడించారు.

Read Also: Ghaziabad: ఈ పిల్లలున్నారే.. కోతి చేష్టలు చేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు.. చివరకు

ఇక, జూన్‌ 3వ తేదీన అహ్మదాబాద్‌ వేదికగా ఐపీఎల్ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ముగింపు వేడుకల్లో ప్రముఖ గాయకుల ప్రదర్శనలతో పాటు మిలిటరీ బ్యాండ్స్‌తో పరేడ్‌ కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి మే 26వ తేదీనే ఐపీఎల్ ఫైనల్‌ జరగాల్సి ఉన్నప్పటికీ.. ఆపరేషన్‌ సింధూర్‌తో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నమెంట్ ని వారం రోజుల పాటు బంద్ చేశారు. ఆ తర్వాత కొన్ని మార్పులతో బీసీసీఐ రీ-షెడ్యూల్‌ను విడుదల చేసింది. భద్రతా కారణాల రీత్యా ఫైనల్‌ మ్యాచ్‌ వేదికను కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు ఛేంజ్ చేసింది.

Exit mobile version