Site icon NTV Telugu

IPL 2024: గ్రౌండ్లోకి వెళ్లి రోహిత్ శర్మను భయపెట్టిన అభిమాని.. వీడియో వైరల్

Rohit Man

Rohit Man

ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. ఓ అభిమాని గ్రౌండ్ లోకి వచ్చాడు. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరకు వెనుకనుంచి వెళ్లడంతో.. ఒక్కసారిగా భయపడ్డాడు. వెంటనే వెనక్కి జరిగి అభిమానికి హగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడే కీపింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది గ్రౌండ్ లోకి వచ్చి వెంటనే అతడిని బయటకు లాక్కెళ్లారు.

Read Also: Tollywood: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. స్టార్ రైటర్ కన్నుమూత

ఇదిలా ఉంటే.. మొన్న విరాట్ కోహ్లీని కూడా ఓ అభిమాని గ్రౌండ్ లోకి వచ్చి కాళ్లు మొక్కి హగ్ చేసుకున్నాడు. వెంటనే గమనించిన సెక్యూరిటీ సిబ్బంది.. అత‌డిని మైదానం నుంచి బ‌య‌ట‌కు తీసుకెళ్లారు. తాజాగా.. రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి హగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పనక్కర్లేదు.

Read Also: Vistara: విస్తారా విమాన సంస్థ కీలక నిర్ణయం!

అభిమానం ఉంటే.. దూరం నుంచి చూస్తూ ఊరుకోవాలి. కానీ.. వారిని కలిసేంత వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత స్టేడియం నుంచి బయటకు తీసుకొచ్చి భద్రతా సిబ్బంది చితకబాదుతున్నారు. దీంతో.. అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన ఆటగాడిని దగ్గరి నుంచి చూసేందుకు వెళ్తే.. ఇలా దౌర్జన్యానికి పాల్పడుతారా అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version