NTV Telugu Site icon

SRH vs RCB: సన్ రైజర్స్ విక్టరీ.. 25 రన్స్ తేడాతో గెలుపు

Srh Won

Srh Won

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు బిగ్ ఫైట్ జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు నమోదయ్యాయి. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. మ్యాచ్ కు హైలెట్ అంటే దినేష్ కార్తీక్ అని చెప్పాలి. దాదాపు మ్యాచ్ గెలిచినంత దగ్గరగా తీసుకొచ్చాడు. డీకే ఔట్ కాకుండా ఉంటే.. ఆర్సీబీ మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది. ఈ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 35 బంతుల్లో 83 పరుగులు చేశాడు.

ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లీ (42), డుప్లెసిస్ (62) పరుగులతో మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన విల్ జాక్స్ (7), రజత్ పాటిదార్ (9) పరుగులు చేశారు. దినేష్ కార్తీక్ (83), మహిపాల్ లోమ్రోర్ (19), చివరలో అనుజ్ రావత్ (25) పరుగులు చేశారు. ఇంత భారీ స్కోరు చేసిన సన్ రైజర్స్.. ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయింది. వీళ్లు కూడా పరుగులు అనర్గళంగా సమర్పించారు. కేవలం కెప్టెన్ కమిన్స్ మాత్రమే 3 వికెట్లు తీయగా.. మయాంక్ మార్కండే 2, నటరాజన్ ఒక వికెట్ తీశాడు.

Attack on CM YS Jagan Case: సీఎం జగన్‌పై దాడి కేసు.. దర్యాప్తు ముమ్మరం..

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. చినస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. వరుస సిక్సర్లతో సన్ రైజర్స్ బ్యాటర్స్ విరుచుకుపడ్డారు. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ సెంచరీతో రాణించాడు. కేవలం 41 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ (34), క్లాసెన్ (67) పరుగులతో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

మార్క్రమ్ (32) పరుగులు, చివరలో అబ్దుల్ సమద్ (37) పరుగులతో రాణించడంతో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు చేసింది. ఈ స్కోరుతో సన్ రైజర్స్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఈ మ్యాచ్ లో వీర విహారం చేయడంతో 278 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్ రైజర్స్ రికార్డు నెలకొల్పింది. కాగా.. సన్ రైజర్స్ బ్యాటర్స్ ముందు బెంగళూరు బౌలర్లు బిత్తర పోయారు. బాల్ ఎక్కడ వేసినా సరే.. బౌండరీ దాటాల్సిందేన్నట్లుగా చితకబాదారు. ఆర్సీబీ బౌలింగ్ లో అందరూ భారీ పరుగులు సమర్పించుకున్నారు. ఫెర్గ్యూసన్ 2 వికెట్లు పడగొట్టాడు. టోప్లీకి ఒక వికెట్ దక్కింది.