Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Srh Vs Rr Rajasthan Royals Captain Sanju Samson Says We Lost The Match In Middle Overs

Rajasthan Royals: అదే మా ఓటమిని శాసించింది.. చాలా బాధగా ఉంది: సంజూ శాంసన్

Published Date :May 25, 2024 , 8:47 am
By Sampath Kumar
Rajasthan Royals: అదే మా ఓటమిని శాసించింది.. చాలా బాధగా ఉంది: సంజూ శాంసన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sanju Samson React on Rajasthan Royals Defeat vs Sunrisers Hyderabad: మిడిల్ ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడమే తమ ఓటమికి కారణం అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. తాము ఊహించిన విధంగా పిచ్ లేదని, రెండో ఇన్నింగ్స్ సమయంలో పూర్తిగా మారిపోయిందన్నాడు. గత మూడేళ్లుగా తాము అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నామని, ఇదంతా ఫ్రాంచైజీ గొప్పతనం వల్లే సాధ్యమైందన్నాడు. రాజస్థాన్ ఫ్రాంచైజీ ప్రతిభ కలిగిన ఆటగాళ్లను భారత జట్టుకు అందిస్తోందని సంజూ చెప్పాడు. ఫైనల్ చేరుకోలేకపోవడం చాలా బాధగా ఉందన్నాడు. శుక్రవారం చెపాక్‌ మైదానంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో రాజస్తాన్‌ 36 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చేతిలో ఓడింది.

మ్యాచ్ అనంతరం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ… ‘ఇదో బిగ్ మ్యాచ్. మొదటి ఇన్నింగ్స్‌లో మేం బౌలింగ్ చేసిన తీరు పట్ల గర్వంగా ఉంది. బ్యాటింగ్ వైఫల్యమే మా ఓటమిని శాసించింది. మిడిల్ ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మా దగ్గర ఆప్షన్స్ లేవు. అక్కడే మేము మ్యాచ్ కోల్పోయాము. మంచు వస్తుందని మేం ఆశించాం కానీ రాలేదు. రెండో ఇన్నింగ్స్ సమయంలో పిచ్ పూర్తిగా మారిపోయింది. బంతి బాగా టర్న్ అయ్యింది. ఈ అవకాశాన్ని సన్‌రైజర్స్ స్పిన్నర్లు ఉపయోగించుకున్నారు. మా కుడిచేతి బ్యాటర్ల‌ను పెవిలియన్ చేర్చారు. లెఫ్టార్మ్ స్పిన్‌లో బంతి బాగా ఆగి వచ్చింది. మే రివర్స్ స్వీప్ షాట్స్‌తో పాటు క్రీజును ఉపయోగించుకోవాల్సింది. సన్‌రైజర్స్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు’ అని అన్నాడు.

Also Read: SRH vs RR: ఆ నిర్ణయమే మా విజయానికి కారణం: ప్యాట్ కమిన్స్

‘ఈ సీజన్‌లోనే కాకుండా గత మూడు సంవత్సరాల నుండి మేం అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాం. ఈ క్రెడిట్ మా ఫ్రాంచైజీదే. దేశం కోసం మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లను రాజస్తాన్ రాయల్స్ వెలుగులోకి తీసుకొస్తోంది. రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ భారత క్రికెట్ జట్టులో బాగా ఆడుతారు. సందీప్ శర్మ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. వేలంలో ఎవరూ కొనకపోయినా రిప్లేస్‌మెంట్ ఆటగాడిగా వచ్చి సత్తాచాటాడు. గత రెండేళ్లుగా సందీప్ శర్మ గణంకాలు పరిశీలిస్తే.. జస్ప్రీత్ బుమ్రా తర్వాతి బౌలర్‌గా ఉన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఇరు కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ జట్లకు ఈ పిచ్ కండిషన్స్ సరిగ్గా సరిపోతాయి. పవర్‌ప్లేలో ఎవరూ పైచేయి సాధిస్తారో చూడాలి. ఫైనల్ గొప్ప మ్యాచ్ కానుంది. గత 16 సంవత్సరాలుగా ఐపీఎల్ మనకు ఇదే అందిస్తోంది’ అని సంజూ శాంసన్ చెప్పాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2024
  • rajasthan royals
  • RR
  • sanju samson
  • Sanju Samson Interview

తాజావార్తలు

  • Vishnu Kumar Raju: ‘ఆల్కహాల్ గన్’ చూపిస్తూ జగన్‌పై విష్ణుకుమార్‌ రాజు హాట్‌ కామెంట్స్..

  • SRH Vs KKR: టాస్ గెలిచిన కోల్‌కత్తా.. SRH బ్యాటింగ్.. 300 రన్స్ లోడింగ్..!

  • Hyderabad: పల్సర్ బైక్‌పై ఐదుగురు యువకుల నిర్లక్ష్య ప్రయాణం.. ఇన్ స్టాలో వైరల్.. చివరకు

  • Strait of Hormuz: హార్ముజ్ తెరవడానికి 35 దేశాలతో చేయి కలిపిన భారత్..

  • CM Chandrababu: అమరావతి ఇక అన్‌స్టాపబుల్‌.. ఇది చారిత్రాత్మకం.. మోడీ, అమిత్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions