SRH vs RR: ఆ నిర్ణయమే మా విజయానికి కారణం: ప్యాట్ కమిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins Hails SRH Coach Daniel Vettori: స్పిన్నర్ షాబాజ్ అహ్మద్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఆడించడమే తమకు కలిసొచ్చిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. షాబాజ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే నిర్ణయం ఎస్‌ఆర్‌హెచ్ కోచ్ డానియల్ వెటోరిది అని చెప్పాడు. అభిషేక్ శర్మ ప్రదర్శన తమకు సర్‌ప్రైజ్ అని, రైట్ ఆర్మ్ ప్లేయర్స్‌ను ఇబ్బంది పెట్టేందుకు అతడిని ఆడించమని పేర్కొన్నాడు. లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నాం అని, ఫైనల్ మ్యాచ్‌లో కూడా గెలుస్తామని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. శుక్రవారం చెపాక్ మైదానంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ 36 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించి.. ఐపీఎల్ 2024 ఫైనల్లో అడుగుపెట్టింది.
మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘ఈ సీజన్ మొత్తం మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. జట్టులో మంచి ఉత్సాహం ఉంది. ఈ సీజన్ ప్రారంభంలో ఫైనల్ చేరాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు దానిని సాధించాము. మా బలం బ్యాటింగ్ అని తెలుసు. జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్స్ అనుభవాన్ని మేం తక్కువ అంచనా వేయడం లేదు. టైటిల్ గెలవడం భువీ, నట్టూ, ఉనాద్కత్ డ్రీమ్. దాంతో నా పని మరింత సులువైంది’ అని చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: SRH vs RR: సన్‌రైజర్స్‌కు కలిసొచ్చిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్.. షాబాజ్ అద్భుతం చేశాడు!
‘షాబాజ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా మా కోచ్ డానియల్ వెటోరి ఆడించారు. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అయితే బాగుంటుందని షాబాజ్ తెలిపాడు. అభిషేక్ శర్మ ప్రదర్శన మాకు బిగ్ సర్‌ప్రైజ్. రైట్ ఆర్మ్ ప్లేయర్స్‌ను ఇబ్బంది పెట్టేందుకు అతన్ని బరిలోకి దించాం. అభిషేక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఇద్దరూ మిడిల్ ఓవర్లలో అద్భుత బౌలింగ్‌తో మాకు విజయం అందించారు. ఈ వికెట్‌పై 170 పరుగుల లక్ష్యం చేధించడం చాలా కష్టం. రెండు వికెట్లు తీస్తే మ్యాచ్‌లో పైచేయి సాధించే అవకాశం ఉంటుందనుకున్నాం. అందరూ బాగా కష్టపడ్డారు. ఫైనల్ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తాం’ అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!