Impact Player Shahbaz Ahmed Key Role in Sunrisers Hyderabad Win: Sఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్‌లో పేలవ ఆటతో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) రెండో క్వాలిఫయర్‌లో సత్తా చాటింది. శుక్రవారం చెపాక్ మైదానంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 36 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. దాంతో ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి సన్‌రైజర్స్ అడుగుపెట్టింది. ఇక తొలి క్వాలిఫయర్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. ఐపీఎల్ టైటిల్ వేటలో ఆదివారం కోల్‌కతాతో సమరానికి ఎస్‌ఆర్‌హెచ్ సిద్ధంగా ఉంది. అయితే రెండో క్వాలిఫయర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ బాగా కలిసొచ్చింది.
ఐపీఎల్ 2024లోని చాలా మ్యాచ్‌లలో షాబాజ్ అహ్మద్ తుది జట్టులో ఆడినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా ఎస్‌ఆర్‌హెచ్ 120/6తో ఉన్న దశలో బ్యాటింగ్‌కు వచ్చి.. 18 బంతుల్లో 18 పరుగులు చేశాడు. బంతికో పరుగు చేసినా.. హెన్రిచ్ క్లాసెన్‌కు అతడు మంచి సహకారం అందించాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి.. స్ట్రైక్ రొటేట్ చేశాడు. దాంతో మరో ఎండ్‌లో క్లాసెన్ వేగంగా పరుగులు చేశాడు.
Also Read: SRH vs RR: షాబాజ్, అభిషేక్ మాయాజాలం.. ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్!
అనంతరం స్పిన్‌కు సహకరిస్తున్న చెపాక్ పిచ్‌ను షాబాజ్ అహ్మద్ చక్కగా ఉపయోగించుకున్నాడు. కీలక మూడు వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌ను గట్టి దెబ్బ తీశాడు. 65/1తో రాజస్థాన్ పటిష్ట స్థితిలో ఉండగా జోరుమీదున్న యశస్వి జైస్వాల్ (42; 21 బంతుల్లో 4×4, 3×6)ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత ప్రమాదకర రియాన్ పరాగ్ (6)తో పాటు ఆర్ అశ్విన్ (0)నూ పెవిలియన్ చేర్చాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 23 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. అద్భుత ప్రద్దర్శనకు గాను అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.