SRH vs RR Eliminator: కమిన్స్‌కు పెద్ద తలనొప్పిగా వైభవ్.. బుడ్డోడిని ఔట్ చేసేందుకు ఏకంగా మూడు ప్లాన్స్!
- ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ vs ఆర్ఆర్
- గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత
- కమిన్స్ సేనకు సవాల్‌గా 15 ఏళ్ల సంచలనం వైభవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins Plans For Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు నేడు న్యూ చండీగఢ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా.. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే ఈ సీజన్లో రాజస్థాన్‌పై రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఎస్ఆర్హెచ్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అయితే ప్యాట్ కమిన్స్ సేనకు ఇప్పుడు 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పెద్ద సవాల్‌గా మారాడు.
ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ తన దూకుడైన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడు 14 మ్యాచ్‌లలో 583 పరుగులు బాదాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటికే ఒక సెంచరీతో పాటు ఎన్నో వేగవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ వైభవ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. తొలి మ్యాచ్‌లో కట్టడి చేసిన హైదరాబాద్ బౌలర్లు.. రెండో మ్యాచ్‌లో మాత్రం బుడ్డోడిని సెంచరీ చేయకుండా ఆపలేకపోయారు. అయినప్పటికీ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం మాత్రం ఎస్ఆర్హెచ్కే దక్కింది.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డిడి క్రేజ్ మాములుగా లేదుగా.! క్రికెటర్స్ మాత్రమే కాదు WWE స్టార్స్ కూడనా..
- SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్‌లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
- Glenn Phillips-Reporter: అసలు అలా అడగొచ్చా.. రిపోర్టర్‌పై జీటీ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ఫైర్!
- Bhuvneshwar Kumar: మేము కాదు, వాళ్లే అసలు హీరోలు.. భువీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఎలిమినేటర్‌కు ముందు జియోస్టార్‌తో మాట్లాడిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. వైభవ్ వంటి బ్యాటర్‌ను ఎదుర్కోవాలంటే ప్లాన్-B, ప్లాన్-C కూడా సిద్ధంగా ఉండాలని తెలిపాడు. ‘ఒక బౌలర్‌గా ముందుగా మన బలాలపై నమ్మకం ఉండాలి. కానీ ప్రత్యర్థి జట్టులో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మార్చగల ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లు ఉంటారు. అలాంటి వారికి అదనంగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాల్సి వస్తుంది. వైభవ్ కోసం కూడా మేము ప్రత్యేక ప్లాన్స్ రెడీ చేశాం. గత మ్యాచ్‌లో అతడు మా మీద సెంచరీ చేశాడు. కొన్ని సందర్భాల్లో వైభవ్, మరికొన్ని సందర్భాల్లో మేము ఆధిపత్యం చెలాయించాం. ఆ మ్యాచ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం’ అని కమిన్స్ చెప్పాడు.
రాజస్థాన్‌పై ఈ సీజన్లో 100 శాతం విజయాల రికార్డు ఉండటం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందా? అనే ప్రశ్నకు కమిన్స్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘ప్రతి మ్యాచ్ కొత్తగా ప్రారంభమవుతుంది. కానీ గత మ్యాచ్‌ల నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మేము రాజస్థాన్‌తో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడాం. ఆర్ఆర్ ఆటగాళ్ల బలహీనతలు, బలాలను గమనించాం. మా ఆటగాళ్లు గత విజయాలను గుర్తు చేసుకుని, ఆ నమ్మకంతో ఫైనల్స్‌లోకి వెళ్లవచ్చు. ఓడిన జట్టుతో మళ్లీ ఆడటం మంచి అనుభూతినే ఇస్తుంది’ అని పేర్కొన్నాడు.
ఇప్పటికే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌లతో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. బౌలింగ్‌లో కమిన్స్ నాయకత్వంలో మరింత ప్రమాదకరంగా మారింది. మరోవైపు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, జురెల్, ఫెరీరాలతో రాజస్థాన్ కూడా దూకుడుగా కనిపిస్తోంది. దీంతో ఈ ఎలిమినేటర్ మ్యాచ్ అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్లర్‌గా మారనుంది.
తాజావార్తలు
-
SRH vs RR Eliminator: కమిన్స్‌కు పెద్ద తలనొప్పిగా వైభవ్.. బుడ్డోడిని ఔట్ చేసేందుకు ఏకంగా మూడు ప్లాన్స్!
-
Disha-Mouni: లెస్బియన్ రూమర్స్‌కు చెక్ పెట్టాలనుకున్న మౌనీ రాయ్.. కానీ రివర్స్ అయిందా?
-
Vaibhav Sooryavanshi: బుడ్డిడి క్రేజ్ మాములుగా లేదుగా.! క్రికెటర్స్ మాత్రమే కాదు WWE స్టార్స్ కూడనా..
-
Manchu Manoj: అనాథలకు అండగా మంచు మనోజ్.. త్వరలో భారీ పునరావాస కేంద్రం!
-
TDP Mahanaadu 2026: మహానాడు వేదికగా లోకేష్ కీలక ప్రకటన.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోయినా వారికి పెద్దపీట.
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!