SRH vs GT: గుజరాత్‌తో హైదరాబాద్ ఢీ.. ప్లేఆఫ్స్‌పై సన్‌రైజర్స్ గురి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH vs GT IPL 2024 Prediction: ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం ఉప్పల్ మైదానంలో గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన సన్‌రైజర్స్.. 14 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు ఒక్క పాయింట్ మాత్రమే చాలు. గుజరాత్‌పై విజయం సాధిస్తే.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సగర్వంగా ప్లేఆఫ్స్ చేరుతుంది.
గుజరాత్‌పై ఓడినా హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్‌కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. కానీ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి.. టాప్-2లో చోటు దక్కించుకోవాలని కమిన్స్ సేన చూస్తోంది. మెరుపు బ్యాటింగ్‌తో అదరగొడుతున్న సన్‌రైజర్స్‌ను సొంతగడ్డపై అడ్డుకోవడం గుజరాత్‌కు సవాలే. మే 8న ఉప్పల్‌లో లక్నోపై 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 9.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ సాధించిన సంగతి తెలిసిందే. వారం విరామం తర్వాత మరింత ఉత్సాహంతో ఆడనున్న సన్‌రైజర్స్.. గుజరాత్‌పైనా చెలరేగేందుకు సిద్ధమైంది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన గుజరాత్.. విజయంతో లీగ్‌ను ముగించాలని చూస్తోంది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: RR vs PBKS: రాజస్థాన్పై పంజాబ్ గెలుపు..
ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి మెరుపు ఆరంభాన్నిస్తే.. సన్‌రైజర్స్‌కు తిరుగుండదు. హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డితో పాటు షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ దూకుడు కొనసాగించాల్సి ఉంది. బౌలింగ్‌లో టీ నటరాజన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్‌తో కూడిన పేస్ త్రయం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆరంభంలో భువీ స్వింగ్ బౌలింగ్‌తో వికెట్స్ పడగొడుతుంటే.. నటరాజన్, కమిన్స్ కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఎలా చెలరేగుతారో చూడాలి. ఈ సీజన్‌లో గుజరాత్‌తో తొలి మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఇప్పటివరకు నాలుగు సార్లు ఇరు జట్లు తలపడగా.. మూడు మ్యాచ్‌ల్లో గుజరాత్ గెలిచింది.
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?