SRH History: ఎస్ఆర్హెచ్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. 22 పరుగుల తేడాతో విజయం!
- ఎస్ఆర్హెచ్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం
- 2013లో ఇదే రోజు ఎస్ఆర్హెచ్ తొలి మ్యాచ్
- 22 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం
- 2008లో ఎంట్రీ ఇచ్చిన డెక్కన్ ఛార్జర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunrisers Hyderabad Debut Match in 2013 vs Pune Warriors: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు ఈరోజు ఎంతో ప్రత్యేకం. 2013లో ఇదే రోజు (ఏప్రిల్ 5) ఎస్ఆర్హెచ్ తమ తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడింది. మొదటి మ్యాచ్‌లోనే జట్టు భవిష్యత్తులో ఎలా ఆడబోతుందో ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. లో స్కోర్లను కూడా అద్భుతంగా డిఫెండ్ చేయగల సామర్థ్యం జట్టుకు ఉందని ఎస్ఆర్హెచ్ ఆ మ్యాచ్‌తో నిరూపించింది. కుమార్ సంగక్కర నాయకత్వంలోని జట్టు 126 పరుగుల స్వల్ప లక్షాన్ని కాపాడుకుని.. ఏకంగా 22 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్‌ను ఘనంగా ఆరంభించింది.
ముందుగా హైదరాబాద్ జట్టుగా డెక్కన్ ఛార్జర్స్ ఉండేది. 2008లో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫ్రాంచైజీ.. 2009లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ నాయకత్వంలో ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా 2012లో డెక్కన్ ఛార్జర్స్ రద్దు చేయబడింది. ఆ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. 2013లో ఏప్రిల్ 5న ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్ ఆడింది. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర సారథ్యంలో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్.. పూణే వారియర్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ కేవలం 126 పరుగులే చేసింది. తిసార పెరీరా (30) టాప్ స్కోరర్ కాగా.. అక్షత్ రెడ్డి (27), పార్థివ్ పటేల్ (19) రన్స్ చేశారు. పూణే బౌలర్ అశోక్ దిండా 2 వికెట్స్ పడగొట్టాడు.
Also Read
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
స్వల్ప ఛేదనలో పూణేకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప, మనీష్ పాండేలు 36 రన్స్ జోడించారు. తిసార పెరీరా (2/29) మొదటి బ్రేక్ ఇవ్వగా.. పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ (3/11), స్పిన్నర్ అమిత్ మిశ్రాలు (3/19) చెలరేగారు. దాంతో పూణే 18.5 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌట్ అయింది. పూణే బ్యాటర్లలో ఉతప్ప (24) టాప్ స్కోరర్. అప్పటి స్టార్ ప్లేయర్స్ మార్లోన్ శామ్యూల్స్, యువరాజ్ సింగ్, రాస్ టేలర్, అభిషేక్ నాయర్, మిచెల్ మార్ష్ విఫలమయ్యారు. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్ ఖాతాలో ప్రత్యేక విజయం చేరింది.
ఆ మ్యాచ్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ అదే స్ట్రాటజీని కొనసాగించింది. బలమైన బౌలింగ్ దళంతో తక్కువ స్కోర్లను కూడా కాపాడుతూ ప్రత్యర్థులకు కఠిన సవాల్ విసిరింది. 13 సంవత్సరాల్లో ఎస్ఆర్హెచ్ 7 సార్లు ప్లేఆఫ్స్‌కు, ఒకసారి టైటిల్ గెలిచింది. ఇది జట్టు స్థిరత్వాన్ని, సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. బౌలింగ్ బలం, క్రమశిక్షణ, తక్కువ స్కోర్లను కాపాడే సామర్థ్యం ఎస్ఆర్హెచ్ జట్టును ఐపీఎల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2026 ఆడుతోంది. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)ను ఢీకొట్టనుంది. డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఉప్పల్ స్టేడియం సొంత మైదానం.
తాజావార్తలు
-
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!