NTV Telugu Site icon

Pat Cummins: హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.. 300 స్కోర్ కొడుతాం!

Pat Cummins Srh

Pat Cummins Srh

SRH Players Enjoys Hyderabad City: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) సంచలన విజయాలతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో 266, 277, 287 రన్స్ చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ 5 విజయాలతో ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళుతోంది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు గెలిస్తే.. ప్లే ఆఫ్స్ చేరుతుంది. మే 2న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.

రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ మూడు రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకుంది. మ్యాచ్‌కు సమయం ఉండడంతో హైదరాబాద్ నగరంలో సన్‌రైజర్స్ ప్లేయర్స్ సందడి చేస్తున్నారు. ఓ వైపు షాపింగ్స్ చేస్తూ.. మరో వైపు కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బేగంపేటలోని లైఫ్‌ స్టైల్‌లో, అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ పాల్గొని సందడి చేశాడు. ఈ సందర్భంగా కమిన్స్‌ మాట్లాడుతూ తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అని తెలిపాడు. అంతేకాదు ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 300 స్కోర్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

Also Read: CSK vs PBKS: వరుస మ్యాచ్‌ల్లో పంజాబ్‌తో ఢీ.. ప్లే ఆఫ్స్ చేరేందుకు చెన్నైకి ఇదే సూపర్ ఛాన్స్!

తాజాగా కొండాపూర్‌లోని శరత్‌సిటీ క్యాపిటల్‌ మాల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ సందడి చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ అధికార భాగస్వామిగా ఉన్న రాన్‌ బ్రాండ్‌ స్టోర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ హెన్రిచ్‌ క్లాసెన్‌, అబ్దుల్‌ సమద్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి, జయదేవ్‌ ఉనద్కత్‌, టీ నటరాజన్‌ పాల్గొని అభిమానులతో ముచ్చటించారు. పలువురు అభిమానులు అడిగిన సరదా ప్రశ్నలకు ఫన్నీ సమాధానాలు ఇచ్చారు. అభిమానులు క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.

Show comments