Site icon NTV Telugu

Sunrisers Hyderabad: ఆఖరి బంతికి వికెట్‌.. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ సంబరాలు చూశారా?

Sunrisers Hyderabad

Sunrisers Hyderabad

Sunrisers Hyderabad PLayers Celebrations: ఐపీఎల్‌ 2024లో వరుస విజయాలతో దూసుకెళుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడ్డుకట్ట వేసింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ ఒకే ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ అందుకుంది. రాజస్థాన్‌ విజయానికి చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా.. భువనేశ్వర్‌ కుమార్ సూపర్‌ బౌలింగ్‌తో రోవ్మాన్ పావెల్‌ను ఎల్బీగా ఔట్‌ చేశాడు. ఉప్పల్ మైదానంలో అప్పటివరకు ఊపిరిబిగపట్టి ఉన్న హైదరాబాద్‌ అభిమానులు.. ఊహించని విజయంతో ఒక్కసారిగా అనందంతో కేరింతలు కొట్టారు. మైదానం మొత్తం అరుపులతో మార్మోగిపోయింది.

ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేయర్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో అందరూ తమదైన శైలిలో సంబరాలు చేసుకున్నారు. ఇక సన్‌రైజర్స్‌ సీఈఓ కావ్య మారన్ అయితే ఎగిరి గంతేశారు. పక్కన ఉన్న వారితో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ ఉత్కంటంగా ఉండడంతో చివరి బంతి వరకు ఉప్పల్ మైదానంను ఏ అభిమాని వీడలేదు.

Also Read: Uttarakhand : ఉత్తరాఖండ్ అడవులకు నిప్పు.. 24 గంటల్లో 43 కేసులు, 52 మందిపై కేసు

ఈ మ్యాచ్‌లో తొలుత హైదరాబాద్‌ 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (58; 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), నితీష్ కుమార్ రెడ్డి (76 నాటౌట్; 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లు ) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(42 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. అనంతరం రాజస్థాన్‌ 7 వికెట్లకు 200 పరుగులు చేసి ఓడిపోయింది. రాజస్థాన్‌కు చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా 11 పరుగులే చేసింది. యశస్వి జైస్వాల్ (67; 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), రియాన్ పరాగ్ (77; 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేశారు.

Exit mobile version