CSK vs Sanju Samson: సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్తున్నట్లు రోజుకో వార్త బయటకు వస్తుంది. అయితే, ఈ న్యూస్ ని ఎక్కడా కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఈ వార్త వైరల్ అవుతుంది. కానీ, ఇందులో నిజం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సీఎస్కే యాజమాన్యం శాంసన్ ను తమ జట్టులోకి వస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంతే కాదు చెన్నైతో పాటు మిగిలిన జట్లు కూడా సంజు శాంసన్ కోసం చూస్తున్నట్లు టాక్.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
అయితే, ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి మరో చిక్కు ఎదురైంది. అదేంటంటే సంజు శాంసన్ కి బదులు ఎవరిని ఇవ్వాలి అనేది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ శాంసన్ ని రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇప్పుడు ఆ మొత్తానికి సమానమైన ప్లేయర్ CSKలో ఎవరా.. అనేది తెలియట్లేదు. ఒకవేళ ట్రేడ్ జరగాలంటే చెన్నై టీంలో 18 కోట్ల రూపాయలకు సమానమైన ప్లేయర్ ఋతురాజ్ గైక్వాడ్ ఒక్కడే కనిపిస్తున్నాడు. కానీ, సీఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇప్పటికే పలుమార్లు గైక్వాడ్‌ను దీర్ఘకాలిక లక్ష్యంతో కెప్టెన్‌గా ఎంపిక చేశామని స్పష్టం చేశారు. అందుకే శాంసన్ ను తీసుకోవటానికి సుముఖంగా ఉన్నప్పటికీ.. బదులుగా ఎవరని ఇవ్వాలి అనే దానిపై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.
Read Also: BV Pattabhiram: ప్రముఖ సైకాలజిస్ట్ బీవీ పట్టాభిరామ్ గుండెపోటుతో మృతి..
కాగా, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం పెద్దగా ట్రేడ్ చేసిన సందర్భాలూ లేవు. చివరిసారిగా 2021 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి రాబిన్ ఉతప్పను తీసుకున్నదే. అది కూడా పూర్తిగా నగదు మార్పిడి ద్వారా జరిగిన ట్రేడ్. అయితే, ఇప్పుడు ట్రేడింగ్ విండో తెరిచే ఉంది కాబట్టి.. సీఎస్కే అధికారికంగా రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌ను సంప్రదిస్తుందా లేదా అనే విషయం చూడాల్సి ఉంది. కానీ, సీఎస్కే తో పాటు మరో రెండు జట్లు కూడా శాంసన్ కోసం రాజస్థాన్‌ను సంప్రదించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
