ఐపీఎల్-2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. హోంగ్రౌండ్ లో పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. రాజస్తాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన బౌలింగ్‌లో.. వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
Toll fee: వాహనదారులకు శుభవార్త.. టోల్ ఛార్జీలపై ఈసీ ఆదేశాలివే!
కాగా.. తాజా డకౌట్ తో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు డకౌట్లు అయిన దినేష్ కార్తీక్ సరసన చేరాడు. దినేష్ కార్తీక్ కూడా ఐపీఎల్ ఇప్పటివరకు 17 సార్లు డకౌట్ అయ్యాడు. తాజాగా.. రోహిత్ శర్మ సైతం 17 సార్లు ఏమీ పరుగులు చేయకుండా చెత్త రికార్డును నెలకొల్పలాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఆర్సీబీ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్(15) ఉన్నాడు. ఆ తర్వాత పీయూష్ చావ్లా (15), మన్ దీప్ సింగ్ (15), సునీల్ నరైన్ (15) ఉన్నారు.
Saranya: స్టార్ నటిపై ఏడేళ్ల శిక్ష పడే కేసు.. పార్కింగ్ కోసం ఇంత రచ్చ చేశారా?
ఈ ఐపీఎల్లో మొదటగా గుజరాత్తో ఆడిన మ్యాచ్లో రోహిత్ శర్మ 43 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఆ తర్వాత.. సన్ రైజర్స్ హైదరాబాద్తో 26 పరుగులు చేశాడు. తాజాగా.. ఈ మ్యాచ్లో గోల్డెన్ డక్ అయ్యాడు.