Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
- ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి
- ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riyan Parag reacted strongly to personal criticism: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026లో మంగళవారం జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పరాగ్.. తన ఆటపైనే కాదు, వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలపై గట్టిగా స్పందించాడు. కొంతమంది కామెంటేటర్లు, సోషల్ మీడియాలో విమర్శలు చేసే వారిపై అసహనం వ్యక్తం చేశాడు. ఎవరైనా సరే క్రికెట్ గురించి మాట్లాడాలని, ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయవద్దని స్పష్టం చేశాడు. మేము కూడా మనుషులమే అని, తప్పులు జరుగుతాయని పరాగ్ పేర్కొన్నాడు.
ఇటీవల వేపింగ్ వివాదం కారణంగా రియాన్ పరాగ్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో విమర్శలను ఎలా తీసుకుంటారని ప్రశ్నించగా.. ‘గత నాలుగేళ్లలో నేను ఓ విషయం అర్థం చేసుకున్నా. నేను ఏం చేసినా ప్రజలు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఆ మాటలు నా ఆటపై, ఫామ్‌పై, మైండ్‌సెట్‌పై ప్రభావం చూపకూడదని నేర్చుకున్నా. కీబోర్డ్ వారియర్స్ (ట్రోలర్స్) ఎప్పుడూ ఉంటారు. వాళ్ల మాటలను బయటే వదిలేయాలి. నా ఆటపై నాకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలుసు. అలాంటి కామెంట్లు నా ఆటను దెబ్బతీయకూడదు’ అని పరాగ్ చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఈ ఐపీఎల్ సీజన్లో మైదానం బయట చాలా విషయాలు జరుగుతున్నాయని, కానీ భారతదేశంలో ప్రజలు క్రికెట్‌ను ఎంతగా ప్రేమిస్తారో తమకు తెలుసని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు. ‘మైదానానికి వచ్చే అభిమానుల కోసం మేము మా శక్తివంచన లేకుండా ఆడతాం. ప్రతి మ్యాచ్‌కు ముందు మేము ఎంతో కష్టపడతాం. ఒక జట్టు 75 లేదా 80 పరుగులకు ఆలౌట్ అయితే.. వాళ్లకు ఆడటం రాదని చెప్పడం చాలా ఈజీ. కానీ ఆ మ్యాచ్‌కు ముందు మూడు, నాలుగు రోజుల పాటు ఎంత కష్టపడతామో ఎవరికీ తెలియదు. 220, 250 పరుగులు చేయాలనే ప్లాన్‌తో మైదానంలోకి దిగుతాం. కానీ ప్రతిసారి అనుకున్నట్లు జరగదు. మేము కూడా మనుషులమే. అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి. మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ ఎవరూ ఉండరు’ అని తెలిపాడు.
కామెంటేటర్లపై కూడా రియాన్ పరాగ్ తీవ్ర స్థాయిలో స్పందించాడు. ‘మ్యాచ్ సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉండే వాళ్ల మాటలు ప్రజలకు ఎక్కువగా చేరతాయి. అందుకే వాళ్లకు ఓ అభ్యర్థన చేస్తున్నా. క్రికెట్‌ను ప్రేమించండి, క్రికెట్ గురించే మాట్లాడండి. ఆటగాళ్ల వ్యక్తిగత విషయాల గురించి దయచేసి మాట్లాడకండి. భారతదేశంలో క్రికెట్ చాలా ముఖ్యమైన ఆట. ప్రపంచంలోనే మేము అత్యుత్తమంగా ఉన్నాం. అలాంటి ఆటకు గౌరవం ఇవ్వాలి’ అని విజ్ఞప్తి చేశాడు. లక్నోపై విజయం సాధించిన రాజస్థాన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇక తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఓడినా కూడా ఇతర జట్ల ఫలితాల ఆధారంగా అవకాశాలు ఉండనున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు