Araku Valley Earthquake: అరకు లోయలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు.. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన జనాలు!
- అరకు లోయలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు
- ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన జనాలు
- గత ఏడాది డిసెంబర్లో కూడా స్వల్ప భూకంపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్ధరాత్రి సమయంలో భూ ప్రకంపనలు సంభవించడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు విశాఖపట్నం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ కంపనలు సంభవించాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. శనివారం రాత్రి సుమారు 11:35 గంటల సమయంలో అరకు వ్యాలీ పరిసరాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సుమారు 8 సెకన్ల పాటు భూమి కంపినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉండగా.. ఈ ఘటన కలవరపరిచింది. కొందరు భూకంపమని అనుమానించగా.. మరికొందరు ఇతర కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు.
Also Read: Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
గత ఏడాది డిసెంబర్ నెలలో కూడా ఇదే ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాంతం భూకంపాలకు గురయ్యే అవకాశాలపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే తాజా ప్రకంపనలు నిజంగా భూకంపమా లేక ఇతర భౌగోళిక లేదా సాంకేతిక కారణాల వల్ల జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సంబంధిత అధికారులు పరిశీలనలు చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!