Rishabh Pant-SRH: పంత్ బ్రో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే ఎందుకంత పగ!
- ఎస్ఆర్హెచ్పై ఎల్ఎస్జీ అద్భుత విజయం
- లక్నో విజయంలో రిషబ్ పంత్ కీలక పాత్ర
- ఎస్ఆర్హెచ్కు మరోసారి కొరకరాని కొయ్యగా పంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) అద్భుత విజయాన్ని అందుకుంది. మహ్మద్ షమీ (2/9) దెబ్బకు మొదట ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులే చేసింది. లక్షాన్ని ఎల్ఎస్జీ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో విజయంలో రిషబ్ పంత్ (68 నాటౌట్; 50 బంతుల్లో 9×4) కీలక పాత్ర పోషించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లు బెంబేలెత్తించినా.. పంత్ తన దూకుడుకు విరుద్ధంగా చివరి వరకు క్రీజులో నిలబడి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఎస్ఆర్హెచ్కు మరోసారి కొరకరాని కొయ్యగా మారాడు.
ఐపీఎల్లో రిషబ్ పంత్ ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్పై 19 ఇన్నింగ్స్‌లు ఆడి 626 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అతని సగటు 44.71గా ఉండటం గమనార్హం. ఇక స్ట్రైక్ రేట్ 143.24గా ఉండటం పంత్ దూకుడు, స్థిరత్వానికి నిదర్శనం. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో జట్టుకు అతడు బలంగా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్‌లో పంత్ ఎప్పుడూ దూకుడుగా ఆడాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును ఆదుకున్నాడు. ఇటీవల జరిగిన మ్యాచ్‌లలో కూడా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటేనే రిషభ్ పంత్ రెచ్చిపోతున్నాడని చెప్పుకోవచ్చు. అతని గణాంకాలు చూస్తే భవిష్యత్తులో కూడా ఎస్ఆర్హెచ్పై అతను మరిన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశాలు ఉన్నాయి. పంత్ గణాంకాలు చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ‘పంత్ బ్రో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే ఎందుకంత పగ’, ‘పంత్ అన్నా.. ఎందిది’ అంటూ సరదాగా ట్వీట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?