ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 47 పరుగుల తేడాలో బెంగళూరు గెలుపొందింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. వికెట్ సాధించడంలో విజయం సాధించారు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. మరోవైపు.. ఢిల్లీ బ్యాటింగ్ లో కెప్టెన్ అక్షర్ పటేల్ (57) అత్యధిక పరుగులు చేశాడు. ఆ తర్వాత షాయ్ హోప్ (29), జేక్ ఫ్రేసర్ (21) పరుగులు చేశారు.
AP Elections 2024: డబ్బుల పంపిణీ విషయంలో ఘర్షణ.. జనసేన నాయకుడి వేలు కొరికిన టీడీపీ నాయకుడు
ఆ తర్వాత.. డేవిడ్ వార్నర్ (1) మరోసారి నిరాశపరిచాడు. అభిషేక్ పోరెల్ (2), కుమార్ కుషాగ్రా (2), ట్రిస్టన్ స్టబ్స్ (3), రశీక్ సలాం (10), కుల్దీప్ యాదవ్ (6), ముఖేష్ కుమార్ (3) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు సంపాదించాడు. ఆ తర్వాత.. ఫెర్గుసన్ 2 వికెట్లు పడగొట్టాడు. స్వప్నిల్ సింగ్, సిరాజ్, కెమెరాన్ గ్రీన్ కు తలో వికెట్ దక్కింది.
Breaking News : పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది ప్రఫుల్ రెడ్డికి పాముకాటు
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 రన్స్ సాధించింది. బెంగళూరు బ్యాటింగ్ లో అత్యధికంగా రజత్ పాటిదర్ (52) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (41), కెమెరాన్ గ్రీన్ (32*) పరుగులు చేశారు. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్లు.. విరాట్ కోహ్లీ (27), డుప్లెసిస్ (6) చేశారు. మహిపాల్ లోమ్రోర్ (13), దినేష్ కార్తీక్, స్వప్నిల్ సింగ్ డకౌట్తో నిరాశపరిచారు. ఆ తరవాత కర్ణ్ శర్మ (6) పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలింగ్ లో ఖలీల్ అహ్మద్, రశీక్ సలాం తలో 2 వికెట్లు సంపాదించారు. ఆ తర్వాత.. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ కు తలో వికెట్ దక్కింది.
