NTV Telugu Site icon

Dinesh Karthik: దినేష్ కార్తీక్ స్కూప్ సిక్స్.. విరాట్ కోహ్లీ సంబరాలు!

Dinesh Karthik Scoop Six

Dinesh Karthik Scoop Six

Virat Kohli jump out of his seat after Dinesh Karthik Hit Scoop Six: ఐపీఎల్‌ 2024లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) తొలి విజయాన్ని అందుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆర్‌సీబీకి అద్బుతమైన విజయాన్ని అందించాడు. దాంతో ఫినిషర్‌గా డీకే మరోసారి నిరూపించుకున్నాడు. అయితే చివరి ఓవర్లో డీకే కొట్టిన ఓ సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

17 ఓవర్‌లో అనూజ్ రావ‌త్ అవుట్ అయిన అనంతరం దినేష్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. వచ్చిరావడంతోనే తన బ్యాట్‌కు పని చెప్పాడు. సామ్‌ కర్రన్‌ వేసిన 17 ఓవర్‌ను ఫోర్‌ బాది బాదాడు. చివరి రెండు ఓవర్లలో ఆర్‌సీబీ విజయానికి 23 పరుగులు అవసరమవ్వగా.. డీకే చెలరేగిపోయాడు. 19 ఓవర్ వేసిన హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో వరుసగా ఫోరు, సిక్స్‌ బాదాడు. 20 ఓవర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌ వేయగా. తొలి బంతినే డీకే స్కూప్ షాట్ ఆడాడు. బంతి వెళ్లి స్టాండ్స్ లో పడింది. దాంతో విజయానికి చేరువైన ఆనందంలో ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కుర్చీ లోంచి లేచి గంతులేశాడు. ఇందుకుసంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: RCB vs PBKS: ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం.. ఈ విజయానికి అతడే కారణం: ఆర్‌సీబీ కెప్టెన్

20 ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదిన దినేష్ కార్తీక్.. మ్యాచ్‌ను ముగించాడు. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ మరో నాలుగు బంతులు ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కేవలం 10 బంతులు ఎదుర్కొన్న డీకే.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన డీకేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. విరాట్‌ కోహ్లీ (77; 49 బంతుల్లో 11×4, 2×6), మహిపాల్ లొమ్రార్‌ (17 నాటౌట్‌; 8 బంతుల్లో 2×4, 1×6) రాణించారు.