RCB vs GT Qualifier 1: మళ్లీ అలానే ఆడతాం.. గుజరాత్‌కు ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ హెచ్చరిక!
- ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్
- ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- గిల్ సేనకు పరోక్ష హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB Captain Patidar Sends Strong Warning to GT: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు మీడియాతో మాట్లాడిన పాటీదార్.. ఈ సీజన్లో బౌలర్ల పరిస్థితి ఎంత కఠినంగా ఉందో వివరించాడు. భారీ స్కోర్లు నమోదవుతున్నప్పటికీ.. ఆర్సీబీ మాత్రం తమ అటాకింగ్ మైండ్‌సెట్‌ను మార్చబోదని స్పష్టం చేశాడు. అదే విధంగా పవర్‌ప్లేలో వికెట్లు తీయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పి.. గిల్ సేనకు పరోక్ష హెచ్చరిక పంపాడు.
ప్రస్తుతం ఐపీఎల్లో 220-250 పరుగుల స్కోర్లు కూడా సేఫ్ కాదని రజత్ పాటీదార్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు, చిన్న బౌండరీలు, డ్యూ ప్రభావం కారణంగా బౌలర్లకు పరిస్థితులు చాలా కఠినంగా మారాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు చిన్న పొరపాటు చేసినా అది నేరుగా సిక్సర్‌గా మారుతోందని చెప్పాడు. అయినప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నా వాటికి తగ్గట్టుగా ఆడటమే తమ పని అని తెలిపాడు. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, జీటీ మధ్య పోరు సమాన బలాల మధ్య జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. లీగ్ దశలో ఇరు జట్లు 18 పాయింట్లతో సమానంగా ముగించాయని గుర్తు చేశాడు. మ్యాచ్ రోజున ఒత్తిడిని ఎవరు బాగా ఎదుర్కొంటారో.. తమ ప్రణాళికలను ఎవరు మెరుగ్గా అమలు చేస్తారో వారే గెలుస్తారని తెలిపాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆర్సీబీ బౌలింగ్‌పై కూడా పాటీదార్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘మా బలం బౌలింగ్. పవర్‌ప్లేలో ఎలా బౌలింగ్ చేస్తామనేది చాలా కీలకం. మేము డిఫెన్స్ ఆడేందుకు రాలేదు, అటాక్ చేయడానికే వచ్చాం. ఆరంభంలోనే వికెట్లు తీసే ప్రయత్నం చేస్తాం. ఈ సీజన్ మొత్తం అదే విధంగా ఆడుతున్నాం. క్వాలిఫయర్-1లో కూడా అటాకింగ్ గేమ్ ఆడతాం. భువనేశ్వర్ చాలా సీనియర్ బౌలర్. అతడికి తన బలాలు బాగా తెలుసు. ముఖ్యంగా జూనియర్ బౌలర్లతో మాట్లాడే తీరు, జట్టులో అతడి ప్రెజెన్స్ చాలా ముఖ్యమైనవి’ అని ప్రశంసించాడు. ధర్మశాలలో జరగబోయే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆర్సీబీ అటాకింగ్ గేమ్ కొనసాగిస్తుందా? లేదా జీటీ తమ బౌలింగ్ బలంతో బెంగళూరును నిలువరించగలదా? అన్నది చూడాలి.
తాజావార్తలు
-
KCR: ఆ బూతుల వీరుడుతో చర్చలా?.. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం
-
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
-
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
-
Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
-
Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే మార్పులు
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!