RCB vs CSK Playing 11: ఫామ్‌లో ఆర్‌సీబీ, సీఎస్‌కేకు విజయం తప్పనిసరి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11 ఇదే!
- నేడు ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్
- ఫామ్‌లో ఆర్‌సీబీ సీఎస్‌కేకు విజయం తప్పనిసరి
- హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11 ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 RCB vs CSK Playing 11 in Chinnaswamy Stadium: ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్లు ఈరోజు తల్పడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్‌సీబీ, సీఎస్‌కేలు ఢీకొట్టనున్నాయి. ఐపీఎల్ 2026లో ఇది 11వ మ్యాచ్ కాగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ హోం గ్రౌండ్‌లో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఫేవరేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఏడాది పేలవ ప్రదర్శన చేసిన సీఎస్‌కే.. ఈ ఏడాది తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసింది.
ఫామ్‌లో ఆర్‌సీబీ:
ఆర్‌సీబీ ఐపీఎల్ 2026 సీజన్‌ను అద్భుత విజయంతో ప్రారంభించింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో బలంగా ఉంది. జట్టులో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వంటి స్టార్ ప్లేయర్లు కీలకంగా మారారు. ఇద్దరు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. కెప్టెన్‌గా రజత్ పాటిదార్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. జితేశ్, డేవిడ్‌లు పెద్ద బలం. అయితే పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశం ఉండటం ఆర్‌సీబీకి ఆందోళనగా మారింది. డఫీ, భువనేశ్వర్, సుయాశ్‌లతో ఆర్‌సీబీ నెట్టుకొస్తోంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
సీఎస్‌కేకు విజయం తప్పనిసరి:
ఇక సీఎస్‌కే పరిస్థితి కాస్త క్లిష్టంగా ఉంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన సీఎస్‌కేకు గాయాలు పెద్ద దెబ్బగా మారాయి. జట్టు కీలక ఆటగాడు ఎంఎస్ ధోని గాయం కారణంగా తొలి రెండు వారాలు దూరం అయ్యాడు. నాథన్ ఎల్లిస్ సీజన్ మొత్తానికి దూరం కాగా, డెవాల్డ్ బ్రెవిస్, మాథ్యూ షార్ట్ గాయాలతో అందుబాటులో లేరు. దీంతో రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, శివమ్ దూబేలపై భారం పడుతోంది. సంజు మూడో మ్యాచ్‌లో అయినా పెద్ద ఇన్నింగ్స్ ఆడుతాడో చూడాలి. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విఫలమవుతున్న రుతురాజ్ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలర్లు నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీలు గాడిన పడాల్సి ఉంది.
హెడ్ టు హెడ్:
ఆర్‌సీబీ, సీఎస్‌కే హెడ్ టు హెడ్ రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు జరిగిన 35 మ్యాచ్‌లలో చెన్నై 21 విజయాలతో ఆధిక్యంలో ఉంది. బెంగళూరు 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. అయితే ఇటీవల కాలంలో ఆర్‌సీబీ కూడా బలంగా పోటీ ఇస్తోంది.
తుది జట్లు (అంచనా):
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, సుయాష్ శర్మ, జేకబ్ డఫీ.
ఇంపాక్ట్ ప్లేయర్: దేవదత్ పడిక్కల్.
సీఎస్‌కే: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అయుష్ మత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, స్పెన్సర్ జాన్సన్.
ఇంపాక్ట్ ప్లేయర్: ఉర్విల్ పటేల్.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!