Site icon NTV Telugu

RCB Victory Parade Stampede: ఆర్సీబీ విక్టరీ పరేడ్.. తొక్కిసలాటకు ప్రధాన కారణం ఇదే..

Bng

Bng

ఐపీఎల్ 2025 సీజన్ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేపట్టిన విక్టరీ పరేడ్‌లో అపశృతి నెలకొంది. ఈ విక్టరీ పరేడ్‌‌కు అభిమానుల భారీ సంఖ్యలో రావడంతో.. వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు ఒక్కసారిగా లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించినట్లు సమాచారం. మరో 37 మంది వరకు గాయపడినట్లు టాక్. చిన్నస్వామి స్టేడియంలో‌కి ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక్కసారిగా దూసుకు రావడంతో పోలీసులు వారిని కట్టడి చేయలేక చేతులు ఎత్తేశారు. ప్రస్తుతం, ఈ తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read Also: RCB Victory Rally: స్టేడియం బయట ఆర్తనాదాలు.. లోపల కొనసాగుతున్న వేడుకలు..!

అయితే, ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏమిటంటే.. ఆర్సీబీ జట్టు అభిమానులు ఒక్కసారిగా చిన్నస్వామి స్టేడియంలోకి రావడానికి ప్రయత్నిస్తుండగా సరైన సమయంలో గేట్లు ఓపెన్ చేయకపోడం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది. దీంతో అభిమానులు వాటిని తోసుకుంటూ ముందుకు దూసుకొచ్చారు.. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Exit mobile version