ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లపై సన్ రైజర్స్ బ్యాటర్లు ఊచకోత చూపించారు. బెంగళూరు ముందు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. చినస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. వరుస సిక్సర్లతో సన్ రైజర్స్ బ్యాటర్స్ విరుచుకుపడ్డారు. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ సెంచరీతో రాణించాడు. కేవలం 41 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ (34), క్లాసెన్ (67) పరుగులతో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Madya Pradesh: దారుణం.. తల్లిని కోడళ్లు కొట్టి చంపుతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు..
మార్క్రమ్ (32) పరుగులు, చివరలో అబ్దుల్ సమద్ (37) పరుగులతో రాణించడంతో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు చేసింది. ఈ స్కోరుతో సన్ రైజర్స్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో 277 పరుగులు చేసిన హైదరాబాద్.. ఈ మ్యాచ్ లో వీర విహారం చేయడంతో 278 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్ రైజర్స్ రికార్డు నెలకొల్పింది. కాగా.. సన్ రైజర్స్ బ్యాటర్స్ ముందు బెంగళూరు బౌలర్లు బిత్తర పోయారు. బాల్ ఎక్కడ వేసినా సరే.. బౌండరీ దాటాల్సిందేన్నట్లుగా చితకబాదారు. ఆర్సీబీ బౌలింగ్ లో అందరూ భారీ పరుగులు సమర్పించుకున్నారు. ఫర్గ్యూసన్ 2 వికెట్లు పడగొట్టాడు. టోప్లీకి ఒక వికెట్ దక్కింది.