RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్‌వుడ్, లివింగ్‌స్టోన్ ఏం చేయలేదు!
- ఆర్సీబీ జట్టుకు సంబంధించిన ఓ భావోద్వేగ కథ
- వైరల్‌గా మారిన మహిళా ఫిజియోథెరపిస్ట్ ఎమిలీ స్టోరీ
- హేజిల్‌వుడ్ సిఫారసు చేయలేదు, లివింగ్‌స్టోన్ లైక్ కొట్టలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB Physiotherapist Emily Story Is Fake: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు సంబంధించిన ఓ భావోద్వేగ కథ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఎమిలీ’ అనే మహిళా ఫిజియోథెరపిస్ట్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి.. క్లీనర్‌గా పనిచేసి.. తర్వాత ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ సిఫారసుతో ఆర్సీబీ జట్టులో ఉద్యోగం సంపాదించిందంటూ పలు పోస్టులు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ఎమిలీ స్టోరీ పూర్తిగా కల్పితమని తాజాగా ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఎమిలీ అనే మహిళ ఆర్సీబీ జట్టులోనే లేదు.
వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం.. బెంగళూరు మ్యాచ్‌ల సమయంలో మైదానంలోకి ఫిజియోగా వచ్చే ఈమె మీకు తెలుసా?, ఆమె జీవితం ఒక సినిమా కథకు పోటీ ఇవ్వగలదు అంటూ పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆమె పేరే ఎమిలీ. పద్నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె.. చదువు ఖర్చుల కోసం ఒక గ్రంథాలయంలో ఉద్యోగంలో చేరింది. ఆపై ఆస్ట్రేలియాలోని ఒక క్రికెట్ అకాడమీలో స్వీపర్‌గా పనిచేస్తూ జీవనం కోసం పోరాడింది. అక్కడ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహిళా క్రికెటర్ల కంటే.. మహిళా ఫిజియోలే ఎమిలీ దృష్టిని ఆకర్షించారు. రోజంతా పనిచేసినా ఇంటి అద్దె కూడా కట్టడానికి సరిపోని పరిస్థితుల్లో.. ఆమె ఫిజియోథెరపీ చదవాలని నిర్ణయించుకుంది. కేవలం తన సంకల్ప బలంతో ఒక ఫిజియోగా మారింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఆ సమయంలోనే ఎమిలీ ఒక స్థానిక క్రికెటర్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక జీవితం అందంగా మారుతుందని భావించినప్పటికీ.. విధికి వక్రీకరించింది. ఆమె భర్త క్రికెట్లో రాణించలేకపోవడంతో.. మద్యంకు బానిసవ్వడంతో కుటుంబం విచ్చిన్నమైంది. భర్త వదిలిపోయినా.. పిల్లల కోసం పోరాటం చేసింది. ఆ సమయంలో ఒక శిక్షణా శిబిరంలో ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఒక కాంతి కిరణంలా ప్రవేశించాడు. ఆమె ప్రతిభను, జీవిత పోరాటాలను గుర్తించి.. ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యానికి పరిచయం చేశాడు. ఎమిలీ పోరాట గాథ విన్న ఆర్సీబీ.. గత సీజన్లో తమ ఫిజియో బృందంలోకి సాదరంగా ఆహ్వానించింది. ఈ రోజు తన కాళ్ళ మీద తాను నిలబడింది. ఈ కథను చాలామంది సోషల్ మీడియాలో భావోద్వేగంతో షేర్ చేశారు. ఓ పోస్టుకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ లైక్ కొట్టాడు. అయితే ఈ స్టోరీలు ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది.
ఫ్యాక్ట్ చెక్ ప్రకారం.. ఆర్సీబీ మెడికల్ లేదా ఫిజియో టీమ్‌లో ఎమిలీ మహిళ ఎవరూ లేరు. ప్రస్తుతం ఆర్సీబీ అధికారిక ఫిజియోథెరపిస్ట్‌గా టమారా జ్వెక్ పని చేస్తున్నారు. అలాగే వైరల్ కథలో చెప్పిన సంఘటనలు ఎక్కడా జరగలేదని నిర్ధారణ అయింది. సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్, షేర్ల కోసం సృష్టించిన కల్పిత స్టోరీగా దీన్ని గుర్తించారు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఈ సీజన్లో ఆర్సీబీ జట్టులో భాగమైనప్పటికీ.. ఎలాంటి సిఫారసు చేయలేదట. అతడికి ఈ కథతో ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఫేక్ స్టోరీపై అభిమానులు సోషల్ మీడియాలో తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు షేర్ చేయొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.
హేజిల్‌వుడ్, మీరు అద్భుతంగా చేశారు.. మీపై నా గౌరవం మరింత పెరిగింది..!!
బెంగళూరు మ్యాచ్‌ల సమయంలో మైదానంలోకి ఫిజియోగా వచ్చే ఈ అమ్మాయి మీకు తెలుసా..?
ఆమె పేరు ఎమిలీ..
ఆమె జీవితం ఒక సినిమా కథకు పోటీ ఇవ్వగలదు..
“మహిళలు బలహీనులు, వారు ఒంటరిగా కుటుంబాన్ని పోషించలేరు” అని చెప్పేవారికి… pic.twitter.com/6jtwfVLyEL— Sandy Papa YSCRP ☺️🇱🇸 (@PapalakeyPapa) May 18, 2026
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!