IPL 2025: టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. విరుష్క దంపతులను బృందావనం నిర్వాహకులు ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కోహ్లీ, అనుష్క గురువు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రేమానంద్ జీ ఆధ్యాత్మిక ప్రవచనాలను విన్నారు. నిజానికి కోహ్లీ కెరీర్ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న సమయాల్లో ఎక్కువగా ప్రేమానంద్ మహారాజ్‌ను కలుస్తారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఘోర వైఫల్యం తర్వాత విరాట్ కుటుంబ సమేతంగా వెళ్లారు. దాంతర్వాత జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. అంతకుముందు ఇంగ్లాండ్ వన్డే సిరీస్ లోనూ సత్తా చాటాడు.
ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఆర్సీబీ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇందులోను కోహ్లీదే కీలక పాత్ర. అయితే విరాట్ స్వామీజీని కలిసాక ఆర్సీబీ శిబరంలో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రేమానంద్ మహారాజ్‌ను దర్శించుకున్న ప్రతిసారి కోహ్లీ విజయం సాధించాడు. ఇప్పుడు ఐపీఎల్ టైటిల్ పోరులో ఆర్సీబీ ముందంజలో ఉండటంతో ఐపీఎల్ టైటిల్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులతో ఈ సారి కోహ్లీ కప్ అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి 17 ఏళ్లుగా అందని ద్రాక్షగా మిగిలిన ఐపీఎల్ ట్రోఫీని ఈ సారైనా ఆర్సీబీ దక్కించుకుంటుందో లేదో చూడాలి.
Mayor Suresh Babu: కడప మేయర్‌కు షాక్.. అనర్హత వేటు వేసిన ప్రభుత్వం..
