Site icon NTV Telugu

CSK vs RCB: టాస్ కీలకం.. మొదట బ్యాటింగ్ చేస్తే రిజల్ట్ ఇదే..!

Rcb Vs Csk Records

Rcb Vs Csk Records

ఐపీఎల్ 2025లో భాగంగా.. కాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్‌లలో విజయం సాధించిన తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనున్నాయి. తమ విజయ పరంపరను కొనసాగించాలనే ఉద్దేశంతో సీఎస్కే, ఆర్సీబీ పోటీపడనున్నాయి. అయితే.. చెపాక్ స్టేడియంలో చెన్నైను ఓడించడం ఆర్సీబీకి అంత సులభం కాదు.

Aman Sweets : మల్లాపూర్ అమన్ స్వీట్స్ ఫ్యాక్టరీ సీజ్.. గడువు ముగిసిన స్వీట్లతో మళ్లీ తయారీ!

చెన్నై సూపర్ కింగ్స్‌కి హోంగ్రౌండ్ అయిన MA చిదంబరం స్టేడియంలో గత 17 ఏళ్లుగా ఆర్సీబీ ఒక్క మ్యాచ్‌లోనూ సీఎస్కేను ఓడించలేకపోయింది. అయితే.. ఈ మ్యాచ్‌లోనైనా బెంగళూరు చెన్నై కంచుకోటను బద్దలు కొట్టగలదా? అనేదే ఆసక్తికర ప్రశ్నగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. సాయంత్రం సమయంలో చెపాక్ స్టేడియంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గత 10 మ్యాచ్‌లలో 7 సార్లు రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. అయితే మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే.. గత ఐదు సీఎస్కే- ఆర్సీబీ మ్యాచ్‌లను గమనిస్తే.. టాస్ గెలిచిన జట్టే మ్యాచ్‌ ఓడిపోయింది.

గత ఐదు మ్యాచ్‌లలో టాస్ గెలిచిన జట్టు ఓడిపోయిన తీరు:
2024: RCB టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది – 6 వికెట్ల తేడాతో ఓటమి
2024: CSK టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది – 27 పరుగుల తేడాతో ఓటమి
2023: RCB టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది – 8 పరుగుల తేడాతో ఓటమి
2022: RCB టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది – 23 పరుగుల తేడాతో ఓటమి
2022: CSK టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది – 13 పరుగుల తేడాతో ఓటమి
అటువంటి పరిస్థితిలో ఈరోజు రెండు జట్లు టాస్ గెలవకూడదని.. ముందుగా బౌలింగ్ చేయాలని కోరుకుంటున్నాయి.

Exit mobile version