Site icon NTV Telugu

IPL 2024: రషీద్ ఖాన్ మరో అరుదైన ఘనత.. ఆ రికార్డు బ్రేక్

Rashid Khan

Rashid Khan

గుజ‌రాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్ మరో అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌పున అత్యధిక వికెట్ టేకర్గా ర‌షీద్ ఖాన్ రికార్డులెక్కాడు. దీంతో.. మహమ్మద్ షమీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఈరోజు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్‌ వికెట్ తీసి ఈ రికార్డు సాధించాడు.

Read Also: Janasena: జనసేన రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ కమిటీ నియామకం

గుజరాత్ తరఫున ఇప్పటి వరకు రషీద్ ఖాన్ 49 వికెట్లు సాధించాడు. మహమ్మద్ షమీ 48 వికెట్లు తీయగా.. తాజాగా అతని రికార్డ్ను బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే.. గాయం కార‌ణంగా మ‌హ్మద్ ష‌మీ ఈ ఐపీఎల్ ఆడటం లేదు. గతేడాది ఐపీఎల్ లో షమీని.. కొన్ని మ్యాచ్ల అనంతరం జట్టులోకి తీసుకోగా తన బౌలింగ్ బలంతో వికెట్ల మీద వికెట్లు పడగొట్టాడు.

Read Also: INDIA Bloc: ఎన్నికల కమీషన్ ముందు ఇండియా కూటమి 5 డిమాండ్లు..

ఇక సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్ గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలిచింది. ఒక మ్యాచ్ లో ఓటమి పాలైంది.

Exit mobile version