RR vs SRH: బ్యాట్ తో మోత మోగించిన వైభవ్, జురెల్.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం

Rr Vs Srh

Rr Vs Srh

ఐపీఎల్ 2026 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 06 వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది. ఎస్ఆర్ హెచ్ కు 229 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌లతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. వైభవ్ తొలి ఓవర్‌లోనే నాలుగు సిక్సర్లు బాదగా, మూడో ఓవర్‌లో యశస్వి వికెట్ కోల్పోయాడు.

వైభవ్ 15 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని, ఆ తర్వాత మోత మోగించాడు. ధ్రువ్ జురెల్ కూడా అర్ధశతకం సాధించి, వైభవ్‌తో కలిసి శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే, 13వ ఓవర్‌లో జురెల్ వికెట్ పడింది. ధ్రువ్ జురెల్ 35 బంతుల్లో 51 పరుగులు చేశాడు. కానీ వైభవ్ నిలకడగా ఆడాడు. వైభవ్ 36 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. షకీబ్ హుస్సేన్ వైభవ్ వికెట్ తీశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ ఎనిమిది బంతుల్లో ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు.

ఇషాన్ మలింగ బౌలింగ్‌లో డోనోవన్ ఫెరీరా 33 పరుగులకు ఔటయ్యాడు. షిమ్రాన్ హెట్మెయర్ కూడా విఫలమయి, ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో 11 పరుగులకే ఔటయ్యాడు. వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, ఐదు ఫోర్లు బాది, 37 బంతుల్లో 103 పరుగులు సాధించి, రాజస్థాన్ జట్టు 228 పరుగులు చేయడంలో కీలకంగా మారాడు. హైదరాబాద్ తరఫున ఇషాన్ మలింగ రెండు వికెట్లు తీయగా, పాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.