RR vs SRH: బ్యాట్ తో మోత మోగించిన వైభవ్, జురెల్.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 06 వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది. ఎస్ఆర్ హెచ్ కు 229 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌లతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. వైభవ్ తొలి ఓవర్‌లోనే నాలుగు సిక్సర్లు బాదగా, మూడో ఓవర్‌లో యశస్వి వికెట్ కోల్పోయాడు.
వైభవ్ 15 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని, ఆ తర్వాత మోత మోగించాడు. ధ్రువ్ జురెల్ కూడా అర్ధశతకం సాధించి, వైభవ్‌తో కలిసి శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే, 13వ ఓవర్‌లో జురెల్ వికెట్ పడింది. ధ్రువ్ జురెల్ 35 బంతుల్లో 51 పరుగులు చేశాడు. కానీ వైభవ్ నిలకడగా ఆడాడు. వైభవ్ 36 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. షకీబ్ హుస్సేన్ వైభవ్ వికెట్ తీశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ ఎనిమిది బంతుల్లో ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఇషాన్ మలింగ బౌలింగ్‌లో డోనోవన్ ఫెరీరా 33 పరుగులకు ఔటయ్యాడు. షిమ్రాన్ హెట్మెయర్ కూడా విఫలమయి, ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో 11 పరుగులకే ఔటయ్యాడు. వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, ఐదు ఫోర్లు బాది, 37 బంతుల్లో 103 పరుగులు సాధించి, రాజస్థాన్ జట్టు 228 పరుగులు చేయడంలో కీలకంగా మారాడు. హైదరాబాద్ తరఫున ఇషాన్ మలింగ రెండు వికెట్లు తీయగా, పాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?