Site icon NTV Telugu

LSG vs PBKS: పంజాబ్ ముందు భారీ టార్గెట్.. లక్నో స్కోరు ఎంతంటే..?

Lsg

Lsg

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. పంజాబ్ ముందు భారీ స్కోరును నిర్దేశించారు. పంజాబ్ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటాన్ డికాక్ (54) అర్ధసెంచరీతో రాణించాడు. కేఎల్ రాహుల్ (15) పరుగులు చేశాడు.

Pawan Kalyan: దేశంలో మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చి దిద్దుతా..

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పడిక్కల్ (9), స్టోయినీస్ (19) పరుగులు చేయగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ (42) పరుగులతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత ఆయూష్ బదోని (8), చివరలో కృనాల్ పాండ్యా (43) పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు. ఇక.. పంజాబ్ బౌలింగ్ లో సామ్ కరన్ 3 వికెట్లతో చెలరేగాడు. అర్ష్దీప్సింగ్ కు రెండు వికెట్లు దక్కాయి. రబాడా, రాహుల్ చాహర్ తలో వికెట్ సంపాదించారు.

BJP: బీజేపీ ఎనిమిదో జాబితా విడుదల

Exit mobile version